ఖతార్ విదేశాంగ శాఖ సహాయ మంత్రి సుల్తాన్ అల్ మురైఖీతో భారత రాయబారి శ్రీకర్ రెడ్డి భేటీ
- September 12, 2026
దోహా: ఖతార్‌లో భారత రాయబారిగా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ కె. శ్రీకర్ రెడ్డి.. ఖతార్ విదేశాంగ శాఖ సహాయ మంత్రి సుల్తాన్ బిన్ సాద్ అల్ మురైఖీతో భేటీ అయ్యారు.ఈ సందర్భంగా ఆయన తన క్రెడెన్షియల్స్ లేఖ ప్రతిని సమర్పించారు.
భారత రాయబారి శ్రీకర్ రెడ్డి భారత నాయకత్వం తరఫున సుల్తాన్ బిన్ సాద్ అల్ మురైఖీకి శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేశారు. అనంతరం ఇరువురు భారత్-ఖతార్ ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు.
రెండు దేశాల మధ్య ఇప్పటికే కొనసాగుతున్న వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడం, విస్తరించడం కోసం తీసుకోవాల్సిన చర్యలపై ఇరువురు అభిప్రాయాలను పంచుకున్నారు.
భారత్, ఖతార్ మధ్య స్నేహపూర్వక, సుదీర్ఘ సంబంధాలు కొనసాగుతున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఇరువురు నేతలు కృషి చేయాలని నిర్ణయించారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- 1980s ఫోటో ట్రెండ్‌పై హైదరాబాద్ పోలీసుల హెచ్చరిక!
- ఏ దేశానికి BRICS కూటమి వ్యతిరేకం కాదు: ప్రధాని మోదీ
- ఇక విదేశాల్లోనే ఫుడ్ హ్యాండ్లర్ పరీక్ష.. ఖతార్ కీలక నిర్ణయం..!!
- ఒమన్‌లో అక్రమ ప్రవేశాల వైరల్ వీడియోపై ROP క్లారిటీ..!!
- బహ్రెయిన్‌లో ఆహార వృథాను తగ్గించేందుకు పిలుపు..!!
- యూఏఈ స్కూళ్లలో వాట్సాప్ గ్రూపులకు కొత్త రూల్స్..!!
- ఖతార్ విదేశాంగ శాఖ సహాయ మంత్రి సుల్తాన్ అల్ మురైఖీతో భారత రాయబారి శ్రీకర్ రెడ్డి భేటీ
- BRICS సదస్సులో ప్రధాని మోదీ, అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖాలెద్ ద్వైపాక్షిక భేటీ
- ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు శ్రీవారి బ్రహ్మోత్సవాల ఆహ్వానం
- 6 ఏళ్ల తర్వాత దిల్లీకి చైనా విమాన సర్వీసులు ప్రారంభం







