నీయాసనీమాట
- September 12, 2026
ఓబిడ్డ ఏందిరా నీలో ఆ భయము
ఓసారి అడుగు ముందుకు వేసి పిరికితనము
ఓమారు తరిమికొట్టు పూరించు సమరశంఖము
ఒక్కరి కోసము కాదుగా ఈ సమాజము !!!!
ఎదురెళ్ళు గళం విప్పి ఘోషించు
ఏ అన్యాయం జరిగిన నినదించు
ఎక్కడ ఏమి జరిగిన ప్రశ్నించు
ఏదేని నిలదీస్తేనే మార్పని ఎదిరించు!!!!
నిరంతరము ఉద్యమాల్లో నినాదం
నివురు కప్పిన నిప్పులా ఆలోచనం
నీకు నీవుగా చెప్పెదే నీ స్వభావం
నీమనసే కదా నీకసలైన సాక్ష్యం !!!
వివక్షతను నిలువునా వ్యతిరేకిస్తూ
విలువలతో వాస్తవాలని వెలికితీస్తూ
వంచనచేసినచో నిర్భయంగా ప్రశ్నిస్తూ
వేదనలని అణచకని అండగా నిలుస్తూ !!!!
ఈనేల నీదిరా మేల్కొనరా సామాన్యుడా
ఈపీల్చే గాలిలో దాగివుంది నీస్వేఛ్ఛరా
ఈమట్టితోనే మమేకమ్యే నీయాస నీమాట
ఇదినీదిరా అని గొంతుకను అక్షరాల్లో నిలిపిన !!!!
నీకే తెలియని నీజీవితం బొమ్మలా మార్చకు
నీ భావాన్ని బహిర్గతం చేయమనిన
నీగొంతుకని వినిపించరా అదియే నీభాషరా
అనిన తెలంగాణ ప్రజాకవి కాళోజీ నారాయణరావు!!!!
--యామిని కోళ్ళూరు ✍️
తాజా వార్తలు
- కువైట్ లైబ్రరీ ప్రాజెక్టులపై సమీక్ష.. ఆక్స్ఫర్డ్ తో చర్చలు..!!
- సౌదీపై దాడుల ఎఫెక్ట్.. ఇరాక్‌లో మైసాన్ ఆపరేషన్స్ కమాండర్ తొలగింపు..!!
- 1980s ఫోటో ట్రెండ్‌పై హైదరాబాద్ పోలీసుల హెచ్చరిక!
- ఏ దేశానికి BRICS కూటమి వ్యతిరేకం కాదు: ప్రధాని మోదీ
- ఇక విదేశాల్లోనే ఫుడ్ హ్యాండ్లర్ పరీక్ష.. ఖతార్ కీలక నిర్ణయం..!!
- ఒమన్‌లో అక్రమ ప్రవేశాల వైరల్ వీడియోపై ROP క్లారిటీ..!!
- బహ్రెయిన్‌లో ఆహార వృథాను తగ్గించేందుకు పిలుపు..!!
- యూఏఈ స్కూళ్లలో వాట్సాప్ గ్రూపులకు కొత్త రూల్స్..!!
- ఖతార్ విదేశాంగ శాఖ సహాయ మంత్రి సుల్తాన్ అల్ మురైఖీతో భారత రాయబారి శ్రీకర్ రెడ్డి భేటీ
- BRICS సదస్సులో ప్రధాని మోదీ, అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖాలెద్ ద్వైపాక్షిక భేటీ







