రొయ్యలు, పెరుగు కూర
- August 20, 2016
కావలసిన పదార్దాలు :
పచ్చిరొయ్యలు : అరకేజి
పెరుగు : అర కప్పు
మషాలా పొడి : అర టీ స్పూన్
పచ్చిమిర్చి : మూడు
ఉల్లి ముక్కలు : అర కప్పు
టమాటా : ఒకటి
ఉప్పు : తగినంత
కారం :టీ స్పూన్
పసుపు : కొద్దిగా
నూనె : అర కప్పు
గసగసాలు : టీ స్పూన్
కరివేపాకు : కొద్దిగా
అల్లం వెల్లుల్లి పేస్టూ : టీ స్పూన్
కొత్తిమీర : కట్ట
కొబ్బరిపొడి : రెండు టీ స్పూన్లు
తయారుచేయు విధానం :
1) రొయ్యలు పొట్టు తీసి కడిగి శుబ్రం చెయ్యాలి.
2) స్టవ్ ఫై నూనె వేడి చేసి ఉల్లి ముక్కలు, మిర్చి ముక్కలు, వేసి వేయించాలి.
3) అవి వేగాక టమాటా ముక్కలు వేసి మెత్త బడే వరకు ఉంచాలి.
4) ఇప్పుడు రొయ్యలు వేసి కాసేపు వేయించాలి.తరువాత కారం, పసుపు, ఉప్పు వేసి కలిపి మూత పెట్టాలి.
5) ఐదు నిముషాలు ఉడికాక అల్లం పేస్టూ, కొబ్బరి పొడి, గరం మషాలా వేసి ఐదు నిముషాలు మూత పెట్టి ఉడికించాలి.
6) ఐదు నిముషాలు అయ్యాక పెరుగు కలిపి స్టవ్ ఆపాలి.
7) దించేముందు కొత్తిమీర వేసి కలిపి దించాలి.
అంతే ఎంతోరుచిగా ఉండే రొయ్యలు పెరుగు కూర రెడి.
తాజా వార్తలు
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..
- అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు..
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి
- యూరప్‌లో వైద్య నిపుణుల శిక్షణకు తుంబే గ్రూప్–రొమేనియా యూనివర్సిటీ భాగస్వామ్యం
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు







