ఖతార్‌లో రిక్రియేషనల్ స్పేసెస్ విస్తరణ వేగవంతం..!!

- September 13, 2026 , by Maagulf
ఖతార్‌లో రిక్రియేషనల్ స్పేసెస్ విస్తరణ వేగవంతం..!!

దోహా: ఖతార్‌లో ప్రజలకు మరిన్ని రిక్రియేషనల్ ప్రాంతాలు అందుబాటులోకి తీసుకురావడంతో పాటు పట్టణ జీవన ప్రమాణాలను మెరుగుపరిచే లక్ష్యంతో రూపొందిస్తున్న నేషనల్ స్ట్రాటజీ ఫర్ ఓపెన్ అండ్ రిక్రియేషనల్ ఏరియాస్ 94 శాతం పూర్తయింది. ఈ మేరకు 2025 వార్షిక విజయాల నివేదికలో మున్సిపాలిటీ మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని వెల్లడించింది. ఖతార్ భవిష్యత్ అభివృద్ధి, పట్టణ విస్తరణ అవసరాలకు అనుగుణంగా సమగ్ర, సుస్థిర పట్టణ ప్రణాళిక వ్యవస్థను అభివృద్ధి చేయడంలో భాగంగా ఈ వ్యూహాన్ని రూపొందిస్తున్నారు.

ఈ ప్రాజెక్టులో ఓపెన్ స్పేస్‌లు, వినోద కార్యకలాపాలు, క్రీడా సదుపాయాల కోసం సమగ్ర ప్రణాళిక రూపొందించనున్నారు. కొత్త వినోద ప్రాంతాలు, సౌకర్యాలను ఏర్పాటు చేయడంతో పాటు దేశవ్యాప్తంగా అనుసంధానమైన గ్రీన్ కారిడార్‌ల నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేయడం కూడా ఇందులో భాగంగా ఉంది. పట్టణ ప్రాంతాల్లో ప్రజా స్థలాల నాణ్యత, వినియోగాన్ని మెరుగుపరచడంతో పాటు పచ్చని ప్రాంతాలు, వినోద సదుపాయాలు పట్టణ అభివృద్ధిలో అంతర్భాగంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.

వర్షపు నీటి పర్యవేక్షణ ప్రాజెక్టు 99.8% పూర్తి

మంత్రిత్వ శాఖ చేపట్టిన స్మార్ట్ రెయిన్‌వాటర్ మానిటరింగ్ ప్రాజెక్టు 99.8 శాతం పూర్తయింది. వర్షపు నీటికి సంబంధించిన మరింత ఖచ్చితమైన సమాచారం, డేటాను భవిష్యత్ ప్రణాళికల్లో ఉపయోగించడంతో పాటు సంబంధిత ప్రభుత్వ సంస్థలన్నింటికీ ఉపయోగపడే ప్రామాణిక డేటాబేస్‌ను రూపొందించనున్నారు. అలాగే GCC డిజైన్ ప్రమాణాల మాన్యువల్ తయారీ 100 శాతం పూర్తయింది. GCC దేశాల మధ్య పట్టణ ప్రణాళిక, డిజైన్ విధానాల్లో ఒకేతీరు ప్రమాణాలను తీసుకురావడంలో ఇది కీలకంగా ఉంటుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. 

అదే సమయంలో ఖతార్ హైడ్రోజియోలాజికల్ అసెస్‌మెంట్ ప్రాజెక్టు 96 శాతం పూర్తయింది. దేశంలోని భూగర్భ జల వ్యవస్థ, దాని ప్రభావం, భూగర్భ నిర్మాణాలపై దాని ప్రభావాలను అధ్యయనం చేయడం ఈ ప్రాజెక్టు ఉద్దేశమని, భూగర్భ జల వనరులను దీర్ఘకాలికంగా సంరక్షించేందుకు అవసరమైన అంశాలను కూడా పరిశీలిస్తున్నట్లు తెలిపారు.

గ్రీన్ బెల్ట్‌కు ప్రాధాన్యం

గ్రీన్ బెల్ట్ డెవలప్మెంట్ స్ట్రాటజీ (Green Belt Development Strategy) 92 శాతం పూర్తయింది. పట్టణ ప్రణాళికలో పర్యావరణ అంశాలను మరింతగా అనుసంధానం చేయడం, దేశంలో పచ్చని మౌలిక వసతులను బలోపేతం చేయడం ఈ వ్యూహం లక్ష్యం. అలాగే గ్రీన్ రూఫ్ ప్లానింగ్ స్టాండర్డ్స్ మాన్యువల్ (Green Roof Planning Standards Manual) తయారీ 100 శాతం పూర్తయింది. భవనాలపై గ్రీన్ రూఫ్‌ల ఏర్పాటుకు సంబంధించిన మార్గదర్శకాలను ఇందులో రూపొందించారు. 

2025లో పట్టణ ప్రణాళిక విభాగం పలు నియంత్రణ మార్గదర్శకాలు, ప్రమాణాల రూపకల్పన, ఆమోదంలోనూ పురోగతి సాధించింది. ఎడారి ప్రాంతాల్లోని బైత్ అల్ బార్ (Bait Al Bar) ఇళ్లకు సంబంధించిన నిబంధనలను కూడా ఆమోదించి బిల్డింగ్ కోడ్‌లో చేర్చారు. కంటైనర్లకు సంబంధించిన మార్గదర్శకాలను సాంకేతికంగా సిద్ధం చేయగా, ప్రస్తుతం ఆమోదం కోసం పెండింగ్‌లో ఉందని పేర్కొన్నారు.

దోహా మెట్రో కారణంగా ప్రభావితమైన ప్లాట్ల అభివృద్ధికి సంబంధించిన విధానాలను కూడా ఆమోదించారు. చారిత్రక ప్రదేశాల చుట్టూ ఉన్న రోడ్డు సెట్‌బ్యాక్ నిబంధనల్లో మార్పులు చేసి, వాటి ప్రత్యేక ప్రణాళిక అవసరాలకు అనుగుణంగా చర్యలు తీసుకోనున్నారు. ఈ ప్రాజెక్టులన్నీ మౌలిక వసతుల అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, వినోద సదుపాయాలు, చారిత్రక వారసత్వ పరిరక్షణ మధ్య సమన్వయాన్ని పెంచేందుకు దోహదపడతాయని మంత్రిత్వ శాఖ తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com