కువైట్‌లో కీలక రహదారి 5 రోజులపాటు మూసివేత..!!
- September 15, 2026
కువైట్: వాహనదారులకు కువైట్ జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ కీలక హెచ్చరిక జారీ చేసింది. కింగ్ ఫహద్ బిన్ అబ్దులజీజ్ అల్ సౌద్ రోడ్ (రోడ్ నంబర్ 40)లోని ఒక కీలక మార్గాన్ని పూర్తిగా మూసివేయనున్నట్లు ప్రకటించింది. సెప్టెంబర్ 16( బుధవారం) నుంచి సెప్టెంబర్ 20 (ఆదివారం) వరకు ఫస్ట్ రింగ్ రోడ్, సెకండ్ రింగ్ రోడ్ మధ్య కింగ్ ఫహద్ రోడ్‌ను పూర్తిగా మూసివేస్తారు.
ఈ మూసివేత సబాహ్ అల్ అవల్ రోడ్ (ఫస్ట్ రింగ్ రోడ్) జంక్షన్ నుంచి ఖాలిద్ యూసఫ్ అల్ మార్జూక్ స్ట్రీట్ (సెకండ్ రింగ్ రోడ్) జంక్షన్ వరకు కొనసాగుతుంది. దీంతో కువైట్ సిటీ నుంచి అల్ అహ్మదీ వైపు వెళ్లే వాహనాల రాకపోకలపై ప్రభావం పడనుంది.
అయితే షెరాటన్ రౌండ్అబౌట్ నుంచి ఫస్ట్ రింగ్ రోడ్ మీదుగా కింగ్ ఫహద్ రోడ్ వైపు వెళ్లే వాహనదారుల కోసం మొదటి బ్రాంచ్ జంక్షన్ తెరిచి ఉంటుందని అధికారులు తెలిపారు. అత్యవసరమైన రోడ్డు నిర్వహణ పనులు చేపట్టేందుకు ఈ మూసివేతను అమలు చేస్తున్నట్లు జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వెల్లడించింది.
ఆంక్షలు అమల్లో ఉన్న సమయంలో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని, ట్రాఫిక్ అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- కువైట్‌లో వాహనదారులకు గుడ్‌న్యూస్..!!
- ఒమన్‌లో ప్రభుత్వ డిజిటల్ సేవలు పునరుద్ధరణ..!!
- ఖతార్‌లో పేషెంట్ సేఫ్టీకి PHCC కీలక చర్యలు..స్పెషల్ క్యాంపెయిన్..!!
- యూఏఈ స్కూళ్లలో కఠిన నిబంధనలు.. హెయిర్‌స్టైల్, హూడీలు, ఎనర్జీ డ్రింక్స్‌పై ఆంక్షలు..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు.. హెచ్చరిక జారీ..!!
- GCC దేశాల బ్యాంకింగ్ సహకారం మరింత బలోపేతం..!!
- సౌదీ అరేబియాలోని మూడు నగరాలపై హౌతీ దాడులు..!!
- కువైట్‌లో కీలక రహదారి 5 రోజులపాటు మూసివేత..!!
- మరో 18 నియోజకవర్గాలకు ఇంఛార్జ్‌లను ప్రకటించిన కవిత!
- అరేబియన్ ట్రావెల్ మార్కెట్ 2026ను సందర్శించిన షేక్ మహమ్మద్







