కృష్ణా పుష్కరోత్సవాలకు భక్తులు పోటెత్తారు
- August 21, 2016
తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా పుష్కరోత్సవాలకు భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు దినం కావడంతో స్నానం ఆచరించేందుకు భక్తులు తెల్లవారే పుష్కర ఘాట్లకు చేరుకున్నారు. విజయవాడలోని సంగమం, పద్మావతి, జగ్గయ్యపేట సమీపంలోని వేదాద్రి ఘాట్లలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. అలాగే గుంటూరు జిల్లాలోని అమరావతి, సీతానగరం ఘాట్లలో భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. కర్నూలు జిల్లాలో సంగమేశ్వరం, పాతాళగంగ, లింగాలగట్టు ఘాట్లకు భక్తులు భారీ గా తరలివచ్చారు.ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిని శ్రీదుర్గామల్లేశ్వరస్వామిని దర్శించుకునేందుకు ఆదివారం భక్తులు పోటెత్తారు. అమ్మవారి దర్శనం కోసం భక్తులు కిలోమీటర్ల మేర బారులు తీరారు.భక్తులు భారీగా తరలిరావడంతో దేవాలయ ప్రాంతం జనసంద్రంగా మారింది. దీంతో భక్తులను అదుపు చేయలేక పోలీసులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ రోజు ఉదయం 9.00 గంటల వరకు 75 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని ఆలయ అధికారులు వెల్లడించారు. తాగేందుకు మంచి నీరు దొరకక భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణలోని మట్టపల్లి, వాడపల్లి, నాగార్జునసాగర్ ఘాట్లలో భక్తుల రద్దీ భారీగా ఉంది. మహబూబ్ నగర్ జిల్లాలోని బీచుపల్లి, గొందిమళ్ల, సోమశిల ఘాట్లలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. కృష్ణా పుష్కరోత్సవం ఆదివారం 10వ రోజుకు చేరుకుంది. మరో రెండు రోజుల్లో ఈ పుష్కరాలు ముగియనున్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాలోని భక్తులు పుణ్యస్నానం ఆచరించేందుకు పయనమవుతున్నారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







