అఫ్ఘానిస్థాన్ లో పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని హమీద్ కర్జాయ్
- August 21, 2016
అఫ్ఘానిస్థాన్ లో పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని, ఆ దేశం నుంచి కార్యకలాపాలు సాగిస్తోన్న ఉగ్ర సంస్థల్ని అదుపుచేయడం లేదని అఫ్ఘాన్ మాజీ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ విమర్శించారు. అఫ్ఘాన్ లో ఉగ్రవాదం పెరుగుదల, ప్రాంతీయంగా ఆ దేశం పాత్రపై చర్చా కార్యక్రమంలో మాట్లాడుతూ.. తమ దేశంలో సాగుతున్న పరోక్ష యుద్ధంతో భారత్‌కు ఎలాంటి సంబంధం లేదన్నారు.బలూచిస్తాన్‌పై మోదీ వ్యాఖ్యల్ని ఆహ్వానించారు. బలూచిస్తాన్ అంశాన్ని కొంతవరకూ తాము అర్థం చేసుకోవడం వల్ల ప్రధాని వ్యాఖ్యల్ని ప్రశంసిస్తున్నామని చెప్పారు. అఫ్ఘాన్ పునర్నిర్మాణంలో నిజాయతీగా భారత్ సహకరిస్తోందన్నారు. ప్రాంతీయ దేశాలు ఎదుర్కొంటున్న సమస్యల్లో ఉగ్రవాదం అతిపెద్ద సవాలుగా మారిందని, దాన్ని ఓడించేందుకు ఉమ్మడిగా పోరాడాలని సూచించారు.చైనా కూడా మంచి పొరుగుదేశంగా ఉందని అయితే భారత్‌తో ఉన్నంత సన్నిహిత సంబంధాలు లేవన్నారు. నాలుగు ఎంఐ 25 హెలికాఫ్టర్లతో పాటు అఫ్ఘాన్ భద్రతా దళాలకు భారత్ శిక్షణ సాయం అందించిందని చెప్పారు. ఐసిస్ ప్రమాదకర ఆయుధమని, దాన్ని ప్రోత్సహిస్తోన్న వారికి వ్యతిరేకంగా అది పనిచేస్తుందని హెచ్చరించారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







