సౌదీ అరేబియాలో వడ్డీ రేట్లు పెంపు..!!

- September 17, 2026 , by Maagulf
సౌదీ అరేబియాలో వడ్డీ రేట్లు పెంపు..!!

రియాద్: సౌదీ అరేబియా కేంద్ర బ్యాంక్ (SAMA) కీలక వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు పెంచింది. ద్రవ్య స్థిరత్వాన్ని కాపాడే లక్ష్యంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు SAMA వెల్లడించింది.

సెంట్రల్ బ్యాంక్ బ్యాంకులకు అందించే రుణాలపై వసూలు చేసే రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచింది. దీంతో ఇది 4.25 శాతం నుంచి 4.50 శాతానికి చేరింది. అదేవిధంగా బ్యాంకులు తమ నిధులను సెంట్రల్ బ్యాంక్‌లో డిపాజిట్ చేసినప్పుడు పొందే వడ్డీ రేటైన రివర్స్ రెపో రేటును కూడా 25 బేసిస్ పాయింట్లు పెంచింది. దీంతో ఇది 3.75 శాతం నుంచి 4.00 శాతానికి చేరింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ తన బెంచ్‌మార్క్ వడ్డీ రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచి 3.75 శాతం నుంచి 4.00 శాతం పరిధికి తీసుకెళ్లిన నేపథ్యంలో సౌదీ సెంట్రల్ బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకుంది.

సౌదీ అరేబియా కరెన్సీ రియాల్ అమెరికా డాలర్‌తో అనుసంధానమై ఉండటంతో, వడ్డీ రేట్ల విషయంలో SAMA సాధారణంగా అమెరికా ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలను అనుసరిస్తుంది.
రెపో రేటు అంటే సెంట్రల్ బ్యాంక్ వాణిజ్య బ్యాంకులకు రుణాలు ఇచ్చేటప్పుడు వసూలు చేసే వడ్డీ రేటు. రివర్స్ రెపో రేటు అంటే బ్యాంకులు తమ నిధులను సెంట్రల్ బ్యాంక్‌లో డిపాజిట్ చేసినప్పుడు పొందే వడ్డీ రేటు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com