JEE మెయిన్ 2027 షెడ్యూల్ విడుదల
- September 17, 2026
న్యూ ఢిల్లీ: భారత దేశవ్యాప్తంగా ఉన్న ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రవేశాల నిమిత్తం నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE Main) 2027 షెడ్యూల్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేసింది. విద్యార్థుల సౌలభ్యం కోసం వచ్చే ఏడాది కూడా ఈ పరీక్షలను రెండు విడతల్లో నిర్వహించనున్నట్లు ఎన్‌టీఏ స్పష్టం చేసింది. మొదటి విడత పరీక్షలు 2027 జనవరి 22, 23, 24, 28, 29, 30 తేదీల్లో జరగనున్నాయి. ఏప్రిల్ నెలలో నిర్వహించే రెండో విడత పరీక్షా తేదీలను త్వరలోనే ప్రకటించనున్నారు. కాగా, ఈ పరీక్షలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ 2026 అక్టోబర్ నెలలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
యూజీసీ నెట్, సియుఈటి పిజి పరీక్షల షెడ్యూల్ వెల్లడి
జేఈఈ మెయిన్‌తో పాటు మరికొన్ని కీలక జాతీయ స్థాయి పరీక్షల తేదీలను కూడా ఎన్‌టీఏ వెల్లడించింది. యూజీసీ నెట్ (UGC NET) పరీక్షను 2026 డిసెంబర్ 14 నుంచి 19వ తేదీ వరకు నిర్వహించనున్నారు. అలాగే కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (CUET-PG) – 2027 పరీక్షలను మార్చి 1 నుంచి 5, 8, 12 నుంచి 20, 24, 25 తేదీల్లో జరపనున్నట్లు తెలిపింది. ఈ విధంగా పరీక్షల తేదీలను ముందుగానే ప్రకటించడం ద్వారా విద్యార్థులు తమ సన్నద్ధతను మరింత ప్రణాళికాబద్ధంగా కొనసాగించేందుకు వీలవుతుంది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో కొత్త 80 కి.మీ రోడ్డు కారిడార్.. ట్రాఫిక్ రద్దీకి చెక్
- ఖతార్‌లో చికెన్, కొన్ని కూరగాయలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు..!!
- బహ్రెయిన్‌లో తెలియని వాట్సాప్ ఛారిటీకి డబ్బులు పంపొద్దు..!!
- కువైట్ హవల్లీలో భద్రతా తనిఖీలు..122 మంది అరెస్ట్..!!
- JEE మెయిన్ 2027 షెడ్యూల్ విడుదల
- ఒమన్–బోట్స్వానా మధ్య కీలక ఒప్పందాలు..!!
- సౌదీ పోర్టుల్లో భారీగా పెరిగిన కంటైనర్ రవాణా..!!
- 14% వృద్ధి నమోదు చేసిన యూఏఈ బీమా రంగం..!!
- ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలిపిన ద్రౌపది ముర్ము, అమిత్ షా, రాహుల్ గాంధీ
- యూఏఈలో అక్టోబర్ నుంచి అధిక వర్షాలు?







