అమరావతి అభివృద్ధి పై CRDA కీలక నిర్ణయాలు
- September 18, 2026
అమరావతి: అమరావతి అభివృద్ధికి సంబంధించి సీఆర్డీఏ (CRDA) సమావేశంలో కొన్ని అత్యంత కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాజధాని ప్రాంతంలో నిర్మాణ పనులను మరింత వేగవంతం చేయడంతో పాటు, ప్రతిష్టాత్మక భవనాల రూపకల్పనకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇందులో భాగంగానే రాజధానిలో చేపట్టబోయే పలు భవన నిర్మాణాలు మరియు మౌలిక వసతుల కల్పనకు అవసరమైన నిధులను మంజూరు చేస్తూ అధికారికంగా ఆమోదం తెలిపారు.
అసెంబ్లీ ఐకానిక్ భవనంపై 250 మీటర్ల స్పెర్ నిర్మాణం
అమరావతిలో నిర్మించ తలపెట్టిన ఐకానిక్ అసెంబ్లీ భవనానికి అదనపు ఆకర్షణగా నిలిచేలా 250 మీటర్ల ఎత్తుతో స్పెర్ (Spire) నిర్మాణానికి సీఆర్డీఏ సమావేశంలో గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ ప్రత్యేక నిర్మాణ పనులను పూర్తి చేసేందుకు దాదాపు రూ.662 కోట్ల అంచనా వ్యయంతో టెండర్లు ఆహ్వానించేందుకు పరిపాలనాపరమైన ఆమోదం మంజూరు చేశారు. ఈ డిజైన్ రాజధాని ప్రత్యేకతను మరింత ఇనుమడింపజేస్తుందని భావిస్తున్నారు.
CRDA: ఎల్‌పీఎస్ లేఅవుట్లలో మౌలిక వసతులకు రూ.1,548 కోట్లు
అలాగే, భూసమీకరణ (LPS) కింద రై తులకు కేటాయించిన లేఅవుట్లలో అన్ని రకాల మౌలిక వసతులను వేగంగా కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఎల్‌పీఎస్ లేఅవుట్లలో రోడ్లు, తాగునీరు, డ్రైనేజీ తదితర సదుపాయాల అభివృద్ధి కోసం రూ.1,548 కోట్లతో టెండర్లు పిలవడానికి పాలనా అనుమతులు జారీ అయ్యాయి. దీనిద్వారా ప్లాట్లు పొందిన రైతులకు తక్షణమే వసతులు అందుబాటులోకి రానున్నాయి.
తాజా వార్తలు
- పాస్‌పోర్ట్ నిబంధనల్లో కీలక మార్పులు..కొత్త రూల్స్ ఇవే
- తమిళనాడులో ‘మేనమామ బంగారు ఉంగరం’ పథకం..
- ‘ఓణత్తాళం’ కార్యక్రమంలో భారత రాయబారి డా. శ్రీకర్ రెడ్డి
- బీసీసీఐ 95వ వార్షిక సర్వసభ్య సమావేశంలో కీలక నిర్ణయాలు
- దుబాయ్: కార్మికుల వసతి గదిలో ఒక్కొక్కరికి 3.7 చదరపు మీటర్ల స్థలం తప్పనిసరి
- హైదరాబాద్‌లో ‘న్యూ ఐడెంటిటీ’ ఫ్లాగ్షిప్ స్టోర్ ప్రారంభం
- తెలంగాణ పోలీస్‌లో వనరుల ఆప్టిమైజేషన్..రూ.90 కోట్లకు పైగా ఆదా
- అమరావతి అభివృద్ధి పై CRDA కీలక నిర్ణయాలు
- గుడ్ న్యూస్..డెంగీ వ్యాక్సిన్ వచ్చేస్తోంది
- యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్‌తో ప్రధాని మోదీ ఫోన్ సంభాషణ







