‘జాంబీ రెడ్డి 2’ లో ఆకట్టుకుంటున్న ఉపేంద్ర ఫస్ట్ లుక్
- September 18, 2026
తేజ సజ్జ, ప్రశాంత్ వర్మ కాంబినేషన్లో వచ్చిన హిట్ చిత్రం ‘జాంబీ రెడ్డి’ సీక్వెల్‌పై టాలీవుడ్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ ‘జాంబీ రెడ్డి 2’ నుంచి చిత్రబృందం ఒక అదిరిపోయే అప్డేట్ను అందించింది. కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర పుట్టినరోజు (సెప్టెంబర్ 18) సందర్భంగా ఆయనకు సంబంధించిన పవర్ఫుల్ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను అధికారికంగా విడుదల చేశారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ యాక్షన్-కామెడీ చిత్రంలో ఉపేంద్ర మాస్, మ్యాడ్‌నెస్‌తో కూడిన ఒక పవర్‌హౌస్ పాత్రలో కనిపించబోతున్నట్లు మేకర్స్ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ ఫస్ట్‌లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
హైదరాబాద్ బ్యాక్‌డ్రాప్‌లో సీక్వెల్ కథ
మొదటి భాగం రాయలసీమ గ్రామీణ నేపధ్యంలో సాగగా, ఈ సీక్వెల్ కథను పూర్తిస్థాయిలో హైదరాబాద్ సిటీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిస్తున్నారు. చార్మినార్ వంటి ఐకానిక్ లొకేషన్లలో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సీక్వెల్ ద్వారా బాలీవుడ్ భామ షనాయా కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుండగా, ‘ది ఫ్యామిలీ మ్యాన్’ ఫేమ్ సుపర్ణ్ ఎస్. వర్మ దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ప్రశాంత్ వర్మ కథ, స్క్రీన్‌ప్లే అందిస్తుండగా గౌర హరి సంగీతాన్ని సమకూరుస్తున్నారు.

2027లో పాన్ వరల్డ్ లెవెల్లో విడుదల
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. తేజ సజ్జ, ఉపేంద్ర కాంబినేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను మేకర్స్ ఇంకా సస్పెన్స్‌గానే ఉంచారు. ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, నేపాలీ, జపనీస్ వంటి పలు అంతర్జాతీయ భాషల్లో 2027లో విడుదల కానుంది. ఒక్కో అప్డేట్తో సినిమాపై క్యూరియాసిటీని పెంచుతున్న ఈ జాంబీ సీక్వెల్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.

తాజా వార్తలు
- పాస్‌పోర్ట్ నిబంధనల్లో కీలక మార్పులు..కొత్త రూల్స్ ఇవే
- తమిళనాడులో ‘మేనమామ బంగారు ఉంగరం’ పథకం..
- ‘ఓణత్తాళం’ కార్యక్రమంలో భారత రాయబారి డా. శ్రీకర్ రెడ్డి
- బీసీసీఐ 95వ వార్షిక సర్వసభ్య సమావేశంలో కీలక నిర్ణయాలు
- దుబాయ్: కార్మికుల వసతి గదిలో ఒక్కొక్కరికి 3.7 చదరపు మీటర్ల స్థలం తప్పనిసరి
- హైదరాబాద్‌లో ‘న్యూ ఐడెంటిటీ’ ఫ్లాగ్షిప్ స్టోర్ ప్రారంభం
- తెలంగాణ పోలీస్‌లో వనరుల ఆప్టిమైజేషన్..రూ.90 కోట్లకు పైగా ఆదా
- అమరావతి అభివృద్ధి పై CRDA కీలక నిర్ణయాలు
- గుడ్ న్యూస్..డెంగీ వ్యాక్సిన్ వచ్చేస్తోంది
- యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్‌తో ప్రధాని మోదీ ఫోన్ సంభాషణ