తమిళనాడులో ‘మేనమామ బంగారు ఉంగరం’ పథకం..
- September 18, 2026
చెన్నై: తమిళనాడులో ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన మరో సంచలన హామీని నెరవేర్చేందుకు సీఎం విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో జన్మించిన ప్రతి చిన్నారికీ ఒక గ్రాము 22 క్యారెట్ల బంగారు ఉంగరాన్ని బహుమతిగా ఇచ్చే ‘మేనమామ బంగారు ఉంగరం’ (థాయ్‌మామన్ తంగ మోదిరం) పథకాన్ని ఈ నెల 28న సీఎం విజయ్ లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ ఏడాది జూన్ 22 నుంచి ప్రభుత్వ ఆస్పత్రుల్లో పుట్టిన ప్రతి శిశువుకూ ఈ పథకాన్ని వర్తింపజేయనుండగా, తొలి విడత పంపిణీ కోసం ఇప్పటికే 1.28 లక్షల ఉంగరాలను ప్రభుత్వం సిద్ధం చేసింది.
ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నియోజకవర్గాల్లో బ్రేక్.. వార్షికంగా లక్షలాది మందికి లబ్ధి:
మరోవైపు ఉప ఎన్నికలు జరగనున్న మదురాంతకం, ధారాపురం నియోజకవర్గాల్లో ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున ఈ పథకం ప్రారంభానికి ఈసీ తాత్కాలికంగా బ్రేక్ వేసింది. ఉచిత అల్పాహార పథకం విస్తరణకు మాత్రమే ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చిందని, ఈ బంగారు ఉంగరం పథకానికి అనుమతి లేదని తెలిపింది. తమిళనాడు(Tamil Nadu Govt) వ్యాప్తంగా ఏడాదికి నమోదయ్యే దాదాపు 7.8 లక్షల జననాల్లో, సుమారు 4.2 లక్షల మంది పిల్లలు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే జన్మిస్తున్నారు. వీరందరికీ ఈ పథకం వర్తించనుండగా, ప్రభుత్వ వైద్యంపై ప్రజల్లో నమ్మకాన్ని పెంచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సర్కార్ వెల్లడించింది.
తాజా వార్తలు
- పాస్‌పోర్ట్ నిబంధనల్లో కీలక మార్పులు..కొత్త రూల్స్ ఇవే
- తమిళనాడులో ‘మేనమామ బంగారు ఉంగరం’ పథకం..
- ‘ఓణత్తాళం’ కార్యక్రమంలో భారత రాయబారి డా. శ్రీకర్ రెడ్డి
- బీసీసీఐ 95వ వార్షిక సర్వసభ్య సమావేశంలో కీలక నిర్ణయాలు
- దుబాయ్: కార్మికుల వసతి గదిలో ఒక్కొక్కరికి 3.7 చదరపు మీటర్ల స్థలం తప్పనిసరి
- హైదరాబాద్‌లో ‘న్యూ ఐడెంటిటీ’ ఫ్లాగ్షిప్ స్టోర్ ప్రారంభం
- తెలంగాణ పోలీస్‌లో వనరుల ఆప్టిమైజేషన్..రూ.90 కోట్లకు పైగా ఆదా
- అమరావతి అభివృద్ధి పై CRDA కీలక నిర్ణయాలు
- గుడ్ న్యూస్..డెంగీ వ్యాక్సిన్ వచ్చేస్తోంది
- యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్‌తో ప్రధాని మోదీ ఫోన్ సంభాషణ







