దుబాయ్‌లో Dh190,000 చోరీ..నిమిషాల్లోనే ముగ్గురు అరెస్ట్..!!
- September 19, 2026
దుబాయ్: దొంగతనం జరిగినట్లు ఫిర్యాదు అందిన కేవలం 4 నిమిషాల్లోనే ముగ్గురు అనుమానితులను దుబాయ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి దొంగిలించిన మొత్తం Dh190,000ను పూర్తిగా స్వాధీనం చేసుకున్నారు.సెప్టెంబర్ 18న ఈ ఘటనపై దుబాయ్ పోలీసులు వివరాలు వెల్లడించారు. నైఫ్ ప్రాంతంలో ఈ-స్కూటర్ పెట్రోల్‌లో ఉన్న పోలీసులు వేగంగా స్పందించి నిందితులను పట్టుకున్నారు.
2 నిమిషాల్లో ఘటనాస్థలికి పోలీసులు
దొంగతనం జరిగిన విషయాన్ని జనరల్ డిపార్టుమెంట్ ఆపరేషనర్ లో కమాండ్ సెంటర్ కు సమాచారం అందించారు. వెంటనే అనుమానితుల వివరాలు, వారి గుర్తింపులకు సంబంధించిన సమాచారాన్ని నైఫ్ ప్రాంతంలోని పెట్రోలింగ్ బృందాలకు పంపించారు. నైఫ్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఈ-స్కూటర్ పెట్రోల్ కేవలం 2 నిమిషాల్లోనే ఘటనాస్థలికి చేరుకుంది.పోలీసులు పరిసర ప్రాంతాల్లో వేగంగా గాలింపు చేపట్టగా, మరో 2 నిమిషాల్లోనే ముగ్గురు అనుమానితులను అరెస్ట్ చేశారు.వారి వద్దే దొంగిలించిన Dh190,000 మొత్తం లభించింది. దీంతో దొంగతనం జరిగిన నాలుగు నిమిషాల్లోనే మొత్తం నగదును పోలీసులు రికవర్ చేశారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో Dh190,000 చోరీ..నిమిషాల్లోనే ముగ్గురు అరెస్ట్..!!
- కువైట్లో ఫైర్ఫోర్స్కు 8,282 అత్యవసర కాల్స్..!!
- అబుదాబి నుంచి రాస్ అల్ ఖైమాకు ఫ్లయింగ్ కార్..!!
- అంగోలా అధ్యక్షుడితో ఒమన్ సుల్తాన్ విందు భేటీ..!!
- ఇజ్రాయెల్ మీడియాలో తప్పుడు కథనాలను ఖండించిన ఖతార్..!!
- 41 దేశాలతో మల్టీనేషనల్ సముద్ర రక్షణ కూటమి..!!
- రెండేళ్ల కష్టాలకు తెర.. ఇద్దరు పిల్లలతో స్వదేశానికి చేరుకున్న భారతీయ మహిళ..!!
- పాస్పోర్ట్ నిబంధనల్లో కీలక మార్పులు..కొత్త రూల్స్ ఇవే
- తమిళనాడులో ‘మేనమామ బంగారు ఉంగరం’ పథకం..
- ‘ఓణత్తాళం’ కార్యక్రమంలో భారత రాయబారి డా. శ్రీకర్ రెడ్డి







