41 దేశాలతో మల్టీనేషనల్ సముద్ర రక్షణ కూటమి..!!
- September 19, 2026
జెడ్డా: 41 దేశాలతో ఏర్పాటైన మల్టీనేషనల్ మారిటైమ్ డిఫెన్స్ కొహలిషన్ కీలక దశకు చేరుకుంది. కూటమి ఇన్షియల్ ఆపరేషనల్ కేపబిలిటీ (IOC) సాధించిన నేపథ్యంలో, త్వరలో సముద్ర ప్రాంతంలో కార్యకలాపాలు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. జెడ్డాలోని వెస్ట్రన్ ఫ్లీట్ కమాండ్ లో గురువారం కూటమి నాలుగో ప్రణాళికా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి 41 దేశాలకు చెందిన 154 మంది నౌకాదళ కమాండర్లు, ప్లానర్లు, రాయబారులు, యూరోపియన్ యూనియన్ ప్రతినిధులు హాజరయ్యారు.
ఆపరేషన్ల దిశగా అడుగులు
కూటమి ఏర్పాటు దశ నుంచి ఇప్పుడు క్రియాశీల కార్యకలాపాల దిశగా మారుతోంది. IOC సాధించిన అనంతరం సభ్య దేశాల సామర్థ్యాలను ఒకే వ్యవస్థలో సమన్వయం చేసి, సముద్ర కార్యకలాపాలకు సిద్ధం చేస్తున్నారు. గత ప్రణాళికా సమావేశం తర్వాత జరిగిన పురోగతిని అధికారులు సమీక్షించారు. కూటమిలో అధికారికంగా చేరుతున్న దేశాల వివరాలను కూడా పరిశీలించారు. ఇప్పటికే పలు దేశాలు కూటమి చార్టర్, జాయింట్ స్టేట్మెంట్ పై సంతకాలు చేశాయి. ప్రస్తుతం కూటమిలో 28 మంది లైజన్ అధికారులు ఉన్నారు. తమ దేశాల నుంచి అందించగల నౌకాదళ, ఇతర రక్షణ సామర్థ్యాలను సభ్య దేశాలు గుర్తిస్తున్నాయి.
సముద్ర మార్గాల భద్రతే ప్రధాన లక్ష్యం
కూటమి తదుపరి దశలో సభ్య దేశాల బలగాలు యూనిఫైడ్ కమాండ్ కింద పనిచేసేలా ఏర్పాట్లు చేయనున్నారు. అనంతరం కూటమి పరిధిలోని సముద్ర ప్రాంతంలో మిషన్లను ప్రారంభించేందుకు బలగాలను మోహరించనున్నారు. అంతర్జాతీయ సముద్ర మార్గాలు, నావిగేషన్ స్వేచ్ఛ, కీలక సముద్ర మార్గాలు మరియు జలసంధుల భద్రతను పరిరక్షించడం తమ ఉమ్మడి బాధ్యతగా కూటమి పేర్కొంది.
అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా సముద్ర నావిగేషన్ భద్రతకు మద్దతు ఇవ్వడం కూటమి ప్రధాన లక్ష్యంగా ఉంది. ఇందుకోసం యూనిఫైడ్ కమాండ్, సమన్వయంతో కూడిన రక్షణ సామర్థ్యాలు, సమాచార భాగస్వామ్యం, పరస్పర సహకారం ద్వారా సముద్ర రవాణాకు ఎదురయ్యే ముప్పులను ఎదుర్కొనే విధంగా కూటమి పనిచేయనుంది.
తాజా వార్తలు
- సౌదీలో మోస్తరు నుంచి భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- అమెరికా–ఇరాన్ సంక్షోభానికి త్వరలో ముగింపు.. ప్రయత్నాలు ముమ్మరం..!!
- అగ్నివీర్లకు గుడ్‌న్యూస్.. సేవా కాలం మరో రెండేళ్లు పొడిగింపు!
- కువైట్‌లో రోడ్డు ప్రమాదం.. 11 మంది భారతీయ నర్సులకు గాయాలు..!!
- ఒమన్‌లో ఉద్యోగ, శిక్షణ లక్ష్యాల్లో 89 శాతం పూర్తి..!!
- గుడ్ న్యూస్ చెప్పిన టీజీఎస్ ఆర్టీసీ
- బహ్రెయిన్‌లో విద్యుత్, నీటి వినియోగదారులకు గుడ్ న్యూస్..!!
- యూఏఈలో వింటర్ హాలిడేస్.. చివరి నిమిషంలో ట్రిప్‌లకు పెరుగుతున్న డిమాండ్..!!
- వాట్సాప్ సిమ్ బైండింగ్ నిబంధనలు..
- బహ్రెయిన్‌లో తాజ్ హోటల్, బాంబే బ్రాసరీ..!!







