అబుదాబి సముద్ర జలాల్లో అరుదైన డాల్ఫిన్ల సందడి..!!
- September 20, 2026
అబుదాబి: అబుదాబి సముద్ర జలాల్లో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. సముద్రపు నీటిపై డాల్ఫిన్లు ఉత్సాహంగా ఎగురుతూ, నీటిలోకి దూకుతూ కనిపించిన వీడియో ప్రస్తుతం ఆకట్టుకుంటోంది. అబుదాబి పర్యావరణ సంస్థ (Environment Agency – Abu Dhabi) శనివారం ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. సెప్టెంబర్ 8న షుఐబ్ అల్ హౌఖానీ ఈ దృశ్యాలను తొలిసారి చిత్రీకరించి షేర్ చేశారు. ఆయన పోస్ట్‌కు ఇప్పటికే దాదాపు 1.4 లక్షల వ్యూస్, 8,000కు పైగా లైక్స్ వచ్చినట్లు అధికారులు తెలిపారు.
అబుదాబి జలాల్లో భారీగా డాల్ఫిన్ జనాభా
అబుదాబి సముద్ర జలాల్లో ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో ఉన్న ఇండియన్ ఓషన్ హంప్‌బ్యాక్ డాల్ఫిన్ల జనాభా ఉందని పర్యావరణ సంస్థ వెల్లడించింది. వీడియోలో కనీసం ఆరు డాల్ఫిన్లు మెరిసే సముద్రపు నీటిలోకి వరుసగా దూకుతూ, మళ్లీ పైకి వస్తూ కనిపించాయి. ఈ దృశ్యాలు అబుదాబి తీర ప్రాంతాల్లో ఉన్న సమృద్ధమైన సముద్ర జీవవైవిధ్యాన్ని ప్రతిబింబిస్తున్నాయని పర్యావరణ సంస్థ పేర్కొంది. డాల్ఫిన్ల సహజ ఆవాసాలను రక్షించడం, సంరక్షించడం ఎంత ముఖ్యమో కూడా ఈ ఘటన గుర్తుచేస్తుందని తెలిపింది.
డాల్ఫిన్లకు దూరంగా ఉండాలని సూచన
డాల్ఫిన్లను చూసే అదృష్టం కలిగిన వారు సురక్షితమైన దూరం నుంచి మాత్రమే వాటిని గమనించాలని, వాటి సహజ ప్రవర్తనకు ఎలాంటి ఆటంకం కలిగించవద్దని అధికారులు సూచించారు.
గతంలో తిమింగలాల సందడి కూడా..
అబుదాబి సముద్ర జలాల్లో సముద్ర జీవులు కెమెరాకు చిక్కడం ఇదే తొలిసారి కాదు. గత ఏడాది బ్రైడ్స్ తిమింగలాలు ఒకే ప్రాంతంలో ఆహారం కోసం గుంపుగా చేరిన దృశ్యాలు నమోదయ్యాయి. అరేబియన్ గల్ఫ్ జలాల్లో బ్రైడ్స్ తిమింగలాలు తరచూ కనిపించినప్పటికీ, ఒకే ప్రాంతంలో పలువురు తిమింగలాలు ప్రత్యేకంగా ఆహారం కోసం గుమిగూడడం మాత్రం మొదటిసారిగా నమోదు చేసిన ఘటన అని అబుదాబి పర్యావరణ సంస్థ తెలిపింది.
తాజా వార్తలు
- ఒమన్‌లో 17 మంది ఆసియా దేశస్థుల అరెస్ట్..!!
- అబుదాబి సముద్ర జలాల్లో అరుదైన డాల్ఫిన్ల సందడి..!!
- నిర్మాణ రంగంపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ కీలక సిఫార్సులు..!!
- యుద్ధం ఆపాలంటే అమెరికాకు 7 షరతులు పెట్టిన ఇరాన్
- బహ్రెయిన్‌లో ‘వికసిత్ భారత్ రన్’..!!
- కువైట్‌లో 40 శాతానికి పైగా బ్రెస్ట్ క్యాన్సర్ బాధితులు..!!
- హౌతీ బాలిస్టిక్ క్షిపణిని అడ్డుకున్న సౌదీ రక్షణ వ్యవస్థలు..!!
- రియాద్‌లో సాటా ఆధ్వర్యంలో ఘనంగా తెలుగు భాషా దినోత్సవం–TBD సీజన్ 5 విజయవంతం
- గ్లోబల్ విలేజ్ ఆఫర్ల పేరుతో మోసాలు.. దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- నీటి పొదుపు పద్ధతులతో వరి సాగు.. దిగుబడులు పెంచుకోవచ్చు: పెద్దపల్లి కలెక్టర్







