ఒమన్‌లో 17 మంది ఆసియా దేశస్థుల అరెస్ట్..!!

- September 20, 2026 , by Maagulf
ఒమన్‌లో 17 మంది ఆసియా దేశస్థుల అరెస్ట్..!!

మస్కట్: ఒమన్‌లోకి అక్రమంగా ప్రవేశించిన 17 మంది ఆసియా దేశస్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. ముసందమ్ గవర్నరేట్‌లోని దిబ్బా, బుఖా విలాయత్‌లలో ఈ అరెస్టులు జరిగినట్లు అధికారులు తెలిపారు.
ముసందమ్ గవర్నరేట్ పోలీస్ కమాండ్ ఆధ్వర్యంలో ఈ చర్యలు చేపట్టారు. దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన కేసులో వారిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. అరెస్టయిన వారిపై చట్టపరమైన ప్రక్రియలను పూర్తి చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com