కువైట్‌లో 40,660 కిలోల ఫుడ్ ధ్వంసం..!!
- September 24, 2026
కువైట్: గడువు ముగిసిన, గుర్తింపు వివరాలు లేని ఆహార ఉత్పత్తులపై కువైట్ అధికారులు కొరడా ఝళిపించారు. అల్-అర్దియా ఇండస్ట్రియల్ ఏరియాలో నిర్వహించిన తనిఖీల్లో మొత్తం 40,660 కిలోల సురక్షితం కాని ఆహార పదార్థాలను అధికారులు స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశారు. జనరల్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ (GAFN) ఆధ్వర్యంలో ఈ తనిఖీలు చేపట్టారు. స్థానిక ఆహార వ్యాపార సంస్థలు ఆరోగ్య, ఆహార భద్రత నిబంధనలు పాటిస్తున్నాయా లేదా అన్నది పరిశీలించేందుకు తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా అధికారులు పలు ఉల్లంఘనలను గుర్తించారు. గడువు ముగిసిన, కల్తీ చేసిన ఆహార పదార్థాల విక్రయం, అపరిశుభ్రత, ఉద్యోగులకు అవసరమైన ఆరోగ్య ధ్రువపత్రాలు లేకపోవడం వంటి ఉల్లంఘనలు బయటపడ్డాయి. ప్రజారోగ్య పరిరక్షణ, వినియోగదారులకు సురక్షితమైన ఆహారం అందించడమే లక్ష్యంగా ఇలాంటి తనిఖీలను నిరంతరం కొనసాగిస్తామని కువైట్ ఫుడ్ అథారిటీ స్పష్టం చేసింది. ఆహార భద్రత నిబంధనలు ఉల్లంఘించే సంస్థలపై చర్యలు కొనసాగుతాయని పేర్కొంది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో షేర్డ్ హౌసింగ్ లీజు ముందే ముగిస్తే.. అద్దె రీఫండ్‌కు అవకాశం..!!
- సౌదీలో దాడులపై మక్కా రక్షణ ఒప్పంద దేశాలు ఆగ్రహం..!!
- 2027లో బెస్ట్ ట్రావెల్ డెస్టినేషన్లలో ఒమన్..!!
- కువైట్‌లో ఫైర్ ఫోర్స్ కొత్త వాట్సాప్ సర్వీస్..!!
- బహ్రెయిన్‌లో డైవింగ్ సెంటర్లలో తనిఖీలు..!!
- ఎల్డీసీలకు అంతర్జాతీయ మద్దతు పెంచాలి: ఖతార్
- యూఏఈ: భారతీయ సంఘాల ప్రతినిధులతో భారత విదేశాంగ శాఖ కార్యదర్శి శ్రీప్రియ రంగనాథన్ భేటీ
- మహాత్మా గాంధీకి శ్రద్ధాంజలి అర్పించిన భారత విదేశాంగ శాఖ కార్యదర్శి శ్రీప్రియ రంగనాథన్
- సౌదీ అరేబియా పై హౌతీల బాలిస్టిక్ క్షిపణుల దాడి యత్నం..
- పరిస్థితులు ప్రతిభకు అడ్డంకులు కావు: గవర్నర్ శివప్రతాప్ శుక్లా







