ఏఐ వినియోగంలో సైబర్ భద్రతపై చర్చించిన నిపుణులు..!!
- September 24, 2026
మనామా: కార్యాలయాల్లో ఏఐను సురక్షితంగా, బాధ్యతాయుతంగా వినియోగించడంపై బహ్రెయిన్‌లో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నేషనల్ సైబర్‌సెక్యూరిటీ సెంటర్ (NCSC), బహ్రెయిన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ (BIBF) సంయుక్తంగా నిర్వహించిన ‘బి స్మార్టర్ దాన్ ఏఐ’ అవగాహన కార్యక్రమం ముగింపు సందర్భంగా ఈ ఫోరమ్ జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ రంగాల్లో ఏఐ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో డేటా, సమాచార భద్రతను కాపాడటం, సైబర్ భద్రతకు ఎదురయ్యే ముప్పులను తగ్గించడం వంటి అంశాలపై చర్చించారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు చెందిన ఉద్యోగులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
నేషనల్ సైబర్‌సెక్యూరిటీ సెంటర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ షేక్ సల్మాన్ బిన్ మహమ్మద్ అల్ ఖలీఫా, బహ్రెయిన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డాక్టర్ అహ్మద్ అబ్దుల్‌హమీద్ అల్ షైఖ్ కార్యక్రమానికి హాజరయ్యారు. సంస్థల కార్యకలాపాల నిర్వహణ, సేవల అభివృద్ధి, డేటా విశ్లేషణ, నిర్ణయాలు తీసుకోవడంలో ఏఐ కీలకంగా మారుతున్న నేపథ్యంలో.. దాని వినియోగంపై సంస్థాగత, వృత్తిపరమైన అవగాహన పెంచుకోవాల్సిన అవసరాన్ని ఫోరమ్‌లో నిపుణులు వివరించారు.
ఏఐను ఉపయోగించే సమయంలో సమాచార భద్రత, వ్యక్తిగత గోప్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ‘ఏఐ ఇన్ ది వర్క్‌ప్లేస్.. అవకాశాలు-రిస్కులు’ పేరుతో నిర్వహించిన ప్యానెల్ చర్చకు నేషనల్ సైబర్‌సెక్యూరిటీ సెంటర్ సైబర్‌సెక్యూరిటీ అవేర్‌నెస్ విభాగం అధిపతి నూర్ సమీర్ ష్వైటర్ మోడరేటర్‌గా వ్యవహరించారు.ప్రభుత్వ, ప్రైవేటు, భద్రతా రంగాలకు చెందిన నిపుణులు డాక్టర్ ఖలీద్ అహ్మద్ అల్ ముతావా, జహ్రా హుస్సేన్ మురాద్, మేజర్ డాక్టర్ మహమ్మద్ అల్ అబ్దుల్లా, నోరా యాసీన్ అల్ బలూషి, హుదా హిలాల్ అల్ మహాయ్జా చర్చలో పాల్గొన్నారు.
కార్యాలయాల్లో ఏఐ భవిష్యత్ వినియోగం, ఏఐపై సంస్థాగత విధానాలు, నిర్ణయాలు తీసుకోవడంలో దాని పాత్ర తదితర అంశాలపై నిపుణులు చర్చించారు. వర్చువల్ ఉద్యోగులు, ఏజెంటిక్ ఏఐ వ్యవస్థల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలను కూడా పరిశీలించారు. ఇటువంటి సాంకేతికతలను సురక్షితంగా నిర్వహించేందుకు సంస్థలు సాంకేతికంగా, విధానపరంగా సిద్ధంగా ఉండటంతో పాటు ఉద్యోగుల్లో సైబర్ భద్రతపై అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని వెల్లడించారు.
తాజా వార్తలు
- అమెరికాలో ల్యాండైన జిన్‌పింగ్
- రోడ్డుపై చీపురు పట్టిన పోలీస్ అధికారి.. వీడియో వైరల్..!!
- ఏఐ వినియోగంలో సైబర్ భద్రతపై చర్చించిన నిపుణులు..!!
- కువైట్‌లో 40,660 కిలోల ఫుడ్ ధ్వంసం..!!
- యూఏఈలో డీప్‌ఫేక్ మోసాలపై మహ్రె హెచ్చరిక..!!
- దుక్మ్ ప్రత్యేక ఆర్థిక మండలిలో OMR8.8 బిలియన్లకు పెట్టుబడులు..!!
- దోహాలో 22వ జ్యువెలరీ అండ్ వాచెస్ ఎగ్జిబిషన్‌కు సన్నాహాలు..!!
- సౌదీలో మరో 6 డ్రైవింగ్ స్కూల్స్..!!
- ఏపీలో 4 కొత్త పోలీస్ కమిషనరేట్లు.. కేబినెట్ ఆమోదం..!
- ఖోర్‌ఫక్కాన్ పోర్టును సందర్శించిన భారత కాన్సుల్ జనరల్ డా. విష్ణువర్ధన్ రెడ్డి







