'గరివిడి లక్ష్మి' నుంచి కొండ కోన కోరసు పాడే సాంగ్ రిలీజ్
- September 25, 2026
భారీ స్థాయి సినిమాలతో అలరించే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కి చెందిన లెజెండరీ జానపద గాయని గరివిడి లక్ష్మి కథని ప్రేక్షకులు ముందుకు తీసుకొస్తుంది. గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది మెరుస్తోంది. గౌరి నాయుడు జమ్ము ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.
బుర్రకథలు చెప్పడమే కాదు, ఓ ఉద్యమంగా మార్చిన లక్ష్మి జీవితాన్ని ఈ సినిమా ఆవిష్కరించనుంది. టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్న ‘గరివిడి లక్ష్మి’ ఓ పాటతో వేలాది హృదయాల్లో నిలిచిపోయిన లెజెండరీ జానపద గాయని జీవితాన్ని రిక్రియేట్ చేస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.
తాజాగా కొండ కోన కోరసు పాడే సాంగ్ రిలీజ్ చేశారు. ఈ పాటని చరణ్ అర్జున్ స్వయంగా సాహిత్యం అందించి ఆకట్టుకునేలా కంపోజ్ చేశారు. అనన్య భట్, చరణ్ అర్జున్ పాడిన తీరు అందరినీ అలరించింది. ఈ పాటకు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తోంది.
ఈ చిత్రంలో నరేష్, రాశి, శరణ్య ప్రదీప్, అంకిత్ కొయ్య, మీసాల లక్ష్మణ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
గరివిడి లక్ష్మి మన ఊరి పాటలు, అనుభూతులు, మన మూలాల నుంచి వచ్చే ఆత్మగౌరవానికి సెల్యూట్ లాంటి సినిమా.
అక్టోబర్ 17న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
తారాగణం: నరేష్, రాశి, ఆనంది, రాగ్ మయూర్, శరణ్య ప్రదీప్, అంకిత్ కొయ్య, మీసాల లక్ష్మణ్, కంచరపాలెం కిషోర్, శరణ్య ప్రదీప్, కుశాలిని
సాంకేతిక సిబ్బంది:
నిర్మాతలు: T.G. విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్
బ్యానర్: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
దర్శకత్వం: గౌరీ నాయుడు జమ్ము
సినిమాటోగ్రాఫర్ (DOP): J. ఆదిత్య
సంగీతం: చరణ్ అర్జున్
చీఫ్ కోఆర్డినేటర్: మేఘా శ్యామ్ పాతాడ
చీఫ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సుజిత్ కుమార్ చౌదరి కొల్లి
ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: సుకుమార్ కిన్నెర,
asst. ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: దుర్గా ప్రసాద్, క్రాంతి కుమార్ దత్తి
ప్రొడక్షన్ కంట్రోలర్: విశ్వేష్ అంపోలు, దాసరి రాజు బాల కృష్ణ
PRO: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
తాజా వార్తలు
- గణేష్ నిమజ్జనాలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి: డీజీపీ సీవీ ఆనంద్
- ఆసియా క్రీడల విజేతలకు సీఎం విజయ్ భారీ నగదు బహుమతి
- హత్యకు గురైన వ్యక్తి భార్య, కుమారుడు అదృశ్యమయ్యారన్న వార్తలను ఖండించిన షార్జా పోలీసులు
- ఏపీలో టాటా పవర్..చిత్తూరులో ఈవీ ఛార్జింగ్ స్టేషన్
- దుబాయ్‌లో భారతీయ కార్మికుల సమస్యలపై చర్చలు
- యూఎన్‌లో పాక్-బంగ్లా కీలక భేటీ
- విశాఖలో విషాదం.. ఆంధ్ర మెడికల్ కాలేజీ విద్యార్థిని ఆత్మహత్య
- జల మార్గాల భద్రత, పౌరుల రక్షణ.. ఐరాసలో బహ్రెయిన్ కీలక వ్యాఖ్యలు..!!
- నాటో చీఫ్, ఐర్లాండ్ ప్రధాని తో కువైట్ క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- గ్లోబల్ పోటీతత్వంలో సౌదీ అరేబియాకు 13వ స్థానం..!!







