'కల్కి' సీక్వెల్ రెగ్యులర్ షూటింగ్ అక్టోబర్‌లో ప్రారంభం
- September 25, 2026
రెబల్ స్టార్ ప్రభాస్ ఎపిక్ సైన్స్ ఫిక్షన్ మైథలాజికల్ ఎక్స్‌ట్రావెగాంజా ‘కల్కి 2898 ఏడీ’ కోసం క్రియేటివ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ సృష్టించిన ప్రపంచం ఇప్పుడు మరింత భారీ స్థాయిలో విస్తరించబోతోంది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సీక్వెల్ రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. ప్రతిష్ఠాత్మక వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ నిర్మిస్తున్న ఈ సీక్వెల్‌లో ప్రభాస్ మరోసారి అలరించబోతున్నారు. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కూడా కీలక పాత్రల్లో కొనసాగనున్నారు. తొలి భాగం అద్భుతమైన బ్లాక్‌బస్టర్‌గా నిలవడంతో పాటు ప్రేక్షకుల నుంచి విశేష ప్రశంసలు అందుకుంది. అంతేకాకుండా రెండు నేషనల్ అవార్డులను సొంతం చేసుకుంది. దీంతో నెక్స్ట్ పార్ట్ పై అంచనాలు మరింత పెరిగాయి. తొలి భాగం ఘనవిజయం సాధించడంతో సీక్వెల్‌పై అంచనాలు భారీగా పెరిగాయి. దీంతో ఇది దేశవ్యాప్తంగా అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఒకటిగా మారింది.
మరింత భారీ స్థాయిలో రూపొందనున్న ఈ చాప్టర్ కోసం నాగ్ అశ్విన్ తెరవెనుక ఇంటెన్స్ వర్క్ చేస్తున్నారు. వరల్డ్, స్కేల్, కథను మరింత గ్రాండ్‌గా తీర్చిదిద్దే పనిలో నిమగ్నమయ్యారు.
ప్రభాస్‌తో పాటు ఇతర కీలక నటీనటులు వచ్చే నెల నుంచి తమ షూటింగ్ షెడ్యూల్‌ను ప్రారంభించనున్నారు. భారీ షెడ్యూల్‌తో షూటింగ్‌ను ప్లాన్ చేస్తున్న టీమ్.. మొత్తం ప్రొడక్షన్‌ను 2027 మిడ్ కి పూర్తి చేయాలని నాగ్ అశ్విన్ లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఇప్పటికే ఇంటెన్స్ ప్రీ-ప్రొడక్షన్ వర్క్ పూర్తయిన నేపథ్యంలో.. నాగ్ అశ్విన్ తన విజన్‌ను సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఇంతకాలం సిద్ధం చేసిన భారీ ప్రణాళికలను మరింత గ్రాండ్ సినిమాటిక్ స్పెక్టకిల్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
తాజా వార్తలు
- గణేష్ నిమజ్జనాలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి: డీజీపీ సీవీ ఆనంద్
- ఆసియా క్రీడల విజేతలకు సీఎం విజయ్ భారీ నగదు బహుమతి
- హత్యకు గురైన వ్యక్తి భార్య, కుమారుడు అదృశ్యమయ్యారన్న వార్తలను ఖండించిన షార్జా పోలీసులు
- ఏపీలో టాటా పవర్..చిత్తూరులో ఈవీ ఛార్జింగ్ స్టేషన్
- దుబాయ్‌లో భారతీయ కార్మికుల సమస్యలపై చర్చలు
- యూఎన్‌లో పాక్-బంగ్లా కీలక భేటీ
- విశాఖలో విషాదం.. ఆంధ్ర మెడికల్ కాలేజీ విద్యార్థిని ఆత్మహత్య
- జల మార్గాల భద్రత, పౌరుల రక్షణ.. ఐరాసలో బహ్రెయిన్ కీలక వ్యాఖ్యలు..!!
- నాటో చీఫ్, ఐర్లాండ్ ప్రధాని తో కువైట్ క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- గ్లోబల్ పోటీతత్వంలో సౌదీ అరేబియాకు 13వ స్థానం..!!







