ఏపీలో టాటా పవర్..చిత్తూరులో ఈవీ ఛార్జింగ్ స్టేషన్‌

- September 25, 2026 , by Maagulf
ఏపీలో టాటా పవర్..చిత్తూరులో ఈవీ ఛార్జింగ్ స్టేషన్‌

దక్షిణ భారతదేశంలో అత్యంత రద్దీగా ఉండే ఇంటర్ సిటీ మరియు పుణ్యక్షేత్రాల మార్గమైన బెంగళూరు-చిత్తూరు-తిరుపతి/చెన్నై రహదారిపై టాటా పవర్ తన మొట్టమొదటి 240 kW DC అల్ట్రా-ఫాస్ట్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్‌ను ప్రారంభించింది. చిత్తూరు సమీపంలోని ‘శ్రీ వర్ష గ్రాండ్’ వద్ద ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని ప్రైవేట్ ఈవీ యజమానులతో పాటు వాణిజ్య, ఫ్లీట్ వాహనాల అవసరాలను వేగంగా తీర్చేలా రూపొందించారు. ఈ కేంద్రంలో ప్రతిపాదించిన సుదూర ప్రయాణాల ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు, తిరుపతి క్షేత్రానికి వెళ్లే భక్తులకు మరియు బెంగళూరు-చెన్నై నగరాల మధ్య ప్రయాణించే పసింజర్లకు రవాణా సమయాన్ని ఆదా చేస్తూ ఛార్జింగ్ సదుపాయాన్ని సులభతరం చేస్తాయి.

ఆధునిక సాంకేతికత – ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు!
యూనివర్సల్ CCS-2 కనెక్టర్లతో కూడిన ఈ అల్ట్రా-ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్, మార్కెట్లో అందుబాటులో ఉన్న దాదాపు అన్ని రకాల ప్రముఖ ఈవీ మోడళ్లకు అనుకూలంగా పనిచేస్తుంది. ఛార్జింగ్ అయ్యే సమయంలో ప్రయాణికులు సమయాన్ని వృథా చేయకుండా శ్రీ వర్ష గ్రాండ్‌లో భోజనం, రెస్ట్‌రూమ్స్ మరియు పార్కింగ్ వసతులను వినియోగించుకోవచ్చు. దేశవ్యాప్తంగా 700 నగరాల్లో 6,700 కంటే ఎక్కువ పబ్లిక్ ఛార్జింగ్ పాయింట్లతో విస్తరించిన టాటా పవర్ ‘EZ Charge’ నెట్‌వర్క్‌లో ఇది భాగమైంది. ప్రయాణికులు తమ స్మార్ట్‌ఫోన్‌లోని ‘Tata Power EZ Charge’ మొబైల్ యాప్ లేదా RFID కార్డ్స్ ద్వారా ఈ స్టేషన్ లభ్యతను ముందస్తుగా తెలుసుకుని ఛార్జింగ్‌ను సులభంగా ప్రారంభించవచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com