గల్ఫ్ ప్రవాసులకు ఆన్లైన్లో ఓపెన్ యూనివర్సిటీ కోర్సులు
- September 26, 2026
విదేశాల్లో ఉద్యోగం చేస్తూనే ఉన్నత విద్య అభ్యసించే అవకాశం
హైదరాబాద్: గల్ఫ్ దేశాల్లో ఉద్యోగాలు చేస్తున్న తెలంగాణ ప్రవాసులకు ఉన్నత విద్యను కొనసాగించే అవకాశం కల్పించే దిశగా డా.బి.ఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ (BRAOU) కీలక చర్యలు చేపట్టింది. 2026–27 విద్యా సంవత్సరానికి నాలుగు ఆన్లైన్ కోర్సులను నిర్వహించేందుకు యూనివర్సిటీకి యూజీసీ అనుమతి లభించింది.
ఈ నేపథ్యంలో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొ.ఘంటా చక్రపాణి, రిజిస్ట్రార్ డా.ఎల్.విజయ కృష్ణారెడ్డి, వివిధ విభాగాల అధిపతులు సెప్టెంబర్ 24న తెలంగాణ ప్రభుత్వ ఎన్నారై అడ్వయిజరీ కమిటీ చైర్మన్ అంబాసిడర్ డా.బి.ఎం.వినోద్ కుమార్, వైస్ చైర్మన్ మంద భీంరెడ్డితో సమావేశమయ్యారు.
విదేశాల్లో ఉద్యోగాలు చేస్తూనే ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే ప్రవాసులకు ఆన్లైన్ కోర్సులు ఉపయోగకరంగా ఉంటాయని ఈ సందర్భంగా చర్చించారు. డిజిటల్ విధానంలో విద్యను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా గల్ఫ్ ప్రవాసులకు విద్యా అవకాశాలను మరింత సులభతరం చేయవచ్చని పేర్కొన్నారు.
ఆన్లైన్ కోర్సులు, ప్రవేశ ప్రక్రియ, ఇతర వివరాలను యూనివర్సిటీ అధికారిక వెబ్సైట్లో తెలుసుకోవచ్చని అధికారులు తెలిపారు.
మరిన్ని వివరాలకు:
BRAOU అధికారిక వెబ్సైట్–ఆన్లైన్ కోర్సుల వివరాలు
హెల్ప్‌డెస్క్: 040-23680 333 / 555
టోల్‌ఫ్రీ: 1800 599 0101
తాజా వార్తలు
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్‌లు విడుదల.. పరిమిత సంఖ్యలో విక్రయాలు
- గల్ఫ్ ప్రవాసులకు ఆన్లైన్లో ఓపెన్ యూనివర్సిటీ కోర్సులు
- OMCAP ఆధ్వర్యంలో జర్మనీలో ఉద్యోగాలకు 55 మంది ఏపీ నర్సుల ఎంపిక..
- మారిషస్ స్టేట్ హౌస్‌లో డా.గజల్ శ్రీనివాస్ గానం
- తెలంగాణను దేశంలో అగ్రశ్రేణి పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దుతాం: మంత్రి జూపల్లి
- ఆంధ్రప్రదేశ్ సంప్రదాయ హస్తకళలకు కొత్త ఊపిరి పోస్తున్న లేపాక్షి
- తెలంగాణ జైళ్ల శాఖకు అరుదైన గౌరవం.. 109వ స్కోచ్ అవార్డు
- యూఏఈలో ఫేక్ లాటరీ స్కామ్.. Dh84,000 కోల్పోయిన వ్యక్తి..!!
- యానిమల్స్ పై క్రూరత్వానికి BD100,000 వరకు ఫైన్.. ఐదేళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్‌లో హలాల్ సర్టిఫికెట్లపై కీలక నిబంధనలు..!!







