₹1000 కోట్ల టార్గెట్‌తో వస్తున్న ‘జైలర్ 2’.. ఆ రోజే గ్రాండ్ రిలీజ్!
- September 26, 2026
రజనీకాంత్ సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో బ్లాక్‌బస్టర్లు ఉన్నప్పటికీ, ‘జైలర్’ చిత్రం ఒక ప్రత్యేకమైన మైలురాయిగా నిలిచింది. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ₹600 కోట్లకు పైగా వసూళ్లను సాధించి, అతివేగంగా ఈ మార్కును అందుకున్న చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. రజనీకాంత్ బాక్సాఫీస్ ఛరిష్మా ఏమాత్రం తగ్గలేదని ఈ సినిమా నిరూపించింది.
భారీ బడ్జెట్‌తో ‘జైలర్ 2’ సీక్వెల్
ఇప్పుడు ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్‌కు సీక్వెల్‌గా ‘జైలర్ 2’ శరవేగంగా సిద్ధమవుతోంది. దాదాపు ₹300 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 15న థియేటర్లలో భారీ స్థాయిలో విడుదల కానుంది. బాక్సాఫీస్ వద్ద ఈసారి ఈ చిత్రం ఏకంగా ₹1000 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టడం ఖాయమనే అంచనాలు ట్రేడ్ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయి.
ఈ సీక్వెల్‌లో మిథున్ చక్రవర్తి, ఎస్.జె. సూర్య, విద్యాబాలన్, రమ్యకృష్ణ వంటి భారతీయ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అనిరుధ్ రవిచందర్ అందిస్తున్న బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. దసరా రేసులో అడుగుపెడుతున్న రజనీకాంత్ ఈసారి ఏ స్థాయి రికార్డులను తిరగరాస్తారో చూడాలి!
తాజా వార్తలు
- వైరల్ వీడియోల పై ఒమన్ పోలీసులు దర్యాప్తు.. చట్టపరమైన చర్యలకు సిద్ధం
- ఎన్నిక ఏదైనా కూటమిదే ఘనవిజయం: మంత్రి కందుల దుర్గేష్
- దుబాయ్ మెరీనాలో 670 మంది కార్మికులకు భద్రత, సామాజిక అవగాహన కార్యక్రమాలు
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్‌లు విడుదల.. పరిమిత సంఖ్యలో విక్రయాలు
- గల్ఫ్ ప్రవాసులకు ఆన్లైన్లో ఓపెన్ యూనివర్సిటీ కోర్సులు
- OMCAP ఆధ్వర్యంలో జర్మనీలో ఉద్యోగాలకు 55 మంది ఏపీ నర్సుల ఎంపిక..
- మారిషస్ స్టేట్ హౌస్‌లో డా.గజల్ శ్రీనివాస్ గానం
- తెలంగాణను దేశంలో అగ్రశ్రేణి పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దుతాం: మంత్రి జూపల్లి
- ఆంధ్రప్రదేశ్ సంప్రదాయ హస్తకళలకు కొత్త ఊపిరి పోస్తున్న లేపాక్షి
- తెలంగాణ జైళ్ల శాఖకు అరుదైన గౌరవం.. 109వ స్కోచ్ అవార్డు







