ఖైదీ నెంబర్ 150తో వర్క్ చేస్తున్న రాజమౌళి కొడుకు..
- August 23, 2016
చిరంజీవి ల్యాండ్‌మార్క్ మూవీ ఖైదీ నెంబర్ 150. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మరి ఇందులో రాజమౌళి కొడుకు కార్తికేయ రోలేంటి అనుకుంటున్నారా? అక్కడికే వచ్చేద్దాం.. చిరంజీవి బర్త్ డే సందర్భంగా నిమిషం నిడివిగల వీడియోని ఆదివారం రాత్రి 12 గంటలకు విడుదల చేసింది కొణెదల ప్రొడక్షన్..చిరంజీవికి స్పెషల్‌గా బర్త్ డే విషెస్ చెప్పింది.ఈ వీడియోని తయారు చేసింది ఎవరోకాదు రాజమౌళి కొడుకు కార్తికేయ! అన్నట్లు కార్తికేయ షోయింగ్ బిజినెస్ పేరుతో ఎప్పటినుండో ఓ కంపెనీ నడుపుతున్నాడట. బాహుబలి మేకింగ్ వీడియో, అఖిల్ మూవీ టీజర్ ఇలా చాలా సినిమాల టీజర్స్‌ని క్రియేటివ్‌గా చేశాడు. సోషల్ మీడియాలో దీనికి మంచి స్పందన కూడా వచ్చింది ఇప్పుడు చిరు బర్త్ డే వీడియో వంతైందని ఫిల్మ్‌న్యూస్. మొత్తానికి ఖైదీ నెంబర్ 150తో వర్క్ చేస్తున్నందుకు హ్యాపీగా ఫీలవుతున్నాడట కార్తీకేయ.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







