భారత పాకిస్తాన్ మధ్య సంబంధాలు మరింత క్షీణదశకు...
- August 23, 2016
భారత పాకిస్తాన్ మధ్య సంబంధాలు మరింత క్షీణదశకు చేరుకుంటున్నాయనేందుకు తాజా పరిణామాలు నిదర్శనంగా కనిపిస్తున్నాయి. పాకిస్తాన్ మీదుగా ప్రయాణించడం భద్రతకు విఘాతం కలిగే అవకాశం ఉందంటూ విమాన పరిశ్రమ ఆందోళన వ్యక్తం చేయడం అందుకు తార్కాణంగా నిలుస్తోంది.గల్ఫ్ దేశాలకు వెళ్ళే మార్గంలో పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ ను తొలగించమంటూ కొన్ని ప్రైవేట్ ఎయిర్ లైన్స్ ప్రభుత్వాన్ని ఆశ్రయించాయి. భద్రతా కారణాల దృష్ట్యా పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ కు దూరంగా ప్రయాణించేందుకు అనుమతించమంటూ ఆయా విమానయాన సంస్థలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరాయి. ఆర్థిక, భద్రతా కారణాలను దృష్టిలో ఉంచుకొని పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ కు దూరంగా ప్రయాణించాలనుకుంటున్నట్లు విమానయాన సంస్థలు అభిప్రాయం వ్యక్తం చేశాయి.గల్ఫ్ దేశాలకు ప్రయాణించే స్పైస్ జెట్, ఇండిగో, జెట్ ఎయిర్వేస్, ఎయిర్ ఇండియా సర్వీసులు.. గల్ఫ్ నుంచి అరేబియా సముద్రం మీదుగా నేరుగా భారత్ లోని అహ్మదాబాద్ కు చేరేట్లు అనుమతించాలని ప్రభుత్వాన్ని అభ్యర్థించాయి. ఓ పక్క కార్బన్ ఉద్గారాలను తగ్గించేందుకు సహాయపడటంతోపాటు, ఇటువంటి ప్రయాణంవల్ల కంపెనీకి లక్ష రూపాయలవరకూ కలసి వస్తుందన్న రెండు ప్రత్యేక కారణాలను కూడా చూపిస్తూ స్పైస్ జెట్ ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తోంది. అయితే రక్షణ మంత్రిత్వ శాఖమాత్రం విమానయాన సంస్థల అభ్యర్థనపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







