48 గంటల్లో ఐరిష్ క్రైమ్ బాస్ అరెస్ట్.. 82 ప్రాపర్టీలు సీజ్..యూఏఈ మంత్రి..!!
- September 28, 2026
అబుదాబి: అంతర్జాతీయ నేరాలపై చర్యల్లో భాగంగా యూఏఈ అధికారులు 48 గంటల్లో ఐర్లాండ్‌కు చెందిన అత్యంత వాంటెడ్ నేరస్థుల్లో ఒకరిని అరెస్ట్ చేశారని, ఫ్రాన్స్ దర్యాప్తుతో సంబంధం ఉన్న 82 ప్రాపర్టీలను స్వాధీనం చేసుకున్నారని యూఏఈ న్యాయశాఖ మంత్రి అబ్దుల్లా సుల్తాన్ బిన్ అవద్ అల్ నుయిమీ వెల్లడించారు. అబుదాబిలో జరుగుతున్న 15వ ఐక్యరాజ్యసమితి నేర నిరోధక, క్రిమినల్ జస్టిస్ కాంగ్రెస్ లో మంత్రి ఈ వివరాలను వెల్లడించారు.
ఐర్లాండ్ నుంచి అధికారిక అప్పగింత అభ్యర్థన అందిన 48 గంటల్లోనే డేనియల్ కినహాన్‌ను అరెస్ట్ చేసినట్లు మంత్రి తెలిపారు. పూర్తి న్యాయపరమైన సమీక్ష అనంతరం దుబాయ్ కోర్ట్ ఆఫ్ కాసేషన్ తుది తీర్పు ఇచ్చిందని, అనంతరం 2026 ఆగస్టు 9న కినహాన్‌ను ఐర్లాండ్‌కు అప్పగించినట్లు వెల్లడించారు. ఐర్లాండ్‌లో క్రిమినల్ సంస్థ కార్యకలాపాలను నడిపిన ఆరోపణలపై కినహాన్‌పై కేసు నమోదైంది. 2016లో డబ్లిన్‌లో జరిగిన కాల్పుల ఘటన అనంతరం అతను దుబాయ్‌కు పారిపోయినట్లు నివేదిక పేర్కొంది.
2022లో అమెరికా అధికారులు కినహాన్‌ను కినహాన్ ఆర్గనైజ్డ్ క్రైమ్ గ్రూప్ కు చెందిన ముగ్గురు నేతల్లో ఒకరిగా గుర్తించారు. ఈ గ్రూప్‌పై దక్షిణ అమెరికా నుంచి ఐర్లాండ్, బ్రిటన్, స్పెయిన్‌లకు కొకైన్ అక్రమ రవాణా, భారీ మొత్తంలో నగదు చలామణి, గ్యాంగ్ వార్‌కు సంబంధించిన ఆరోపణలు ఉన్నాయి.
మరో కేసులో యూఏఈ, ఫ్రాన్స్ అధికారుల మధ్య ప్రత్యక్ష సమన్వయంతో నలుగురు వ్యక్తులకు సంబంధించిన ఆస్తులను గుర్తించి, వాటిని ట్రేస్ చేసినట్లు మంత్రి తెలిపారు. ఈ చర్యల ఫలితంగా 2025 నవంబర్‌లో యూఏఈలో 82 ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ న్యాయ సహకారం కోసం యూఏఈకి వచ్చే అప్పగింత అభ్యర్థనలు 2021 నుంచి 2025 మధ్య 235 శాతం పెరిగాయని తెలిపారు. ఇదే కాలంలో పరస్పర న్యాయ సహాయ అభ్యర్థనలు 244 శాతం పెరిగినట్లు వెల్లడించారు.
ప్రస్తుతం యూఏఈకి 53 దేశాలతో 140కి పైగా ద్వైపాక్షిక న్యాయ సహకార ఒప్పందాలు ఉన్నాయని మంత్రి తెలిపారు. స్వచ్ఛంద అప్పగింత కేసుల్లో యూఏఈ సగటు స్పందన సమయం ఐదు రోజులకు తగ్గిందని, అంతర్జాతీయ మార్గదర్శకాల్లో పేర్కొన్న 60 నుంచి 180 రోజుల వ్యవధితో పోలిస్తే ఇది తక్కువేనని మంత్రి అవద్ అల్ నుయిమీ వివరించారు.
తాజా వార్తలు
- ఖతార్ లో ప్రత్యేక వాహన రిజిస్ట్రేషన్ నంబర్లకు దరఖాస్తులు ఆహ్వానం..!!
- అక్టోబర్ 1 నుంచి ఒమన్‌లో 1,546 వస్తువులపై జీరో వ్యాట్..!!
- ఒమన్ లో కన్జుమర్ కాన్ఫిడెన్స్ సర్వే నిర్వహిస్తున్న ఎన్సీఎస్ఐ..!!
- అల్ షహీద్ పార్క్ మూడో దశ ప్రారంభోత్సవం.. రెండు రోజుల కార్నివాల్..!!
- అక్టోబర్ 21న రియాద్ సీజన్ 2026 ప్రారంభం..!!
- బహ్రెయిన్ ఇండియన్ స్కూల్ లో ఆకట్టుకున్న పీస్ డే ప్రోగ్రామ్స్..!!
- 48 గంటల్లో ఐరిష్ క్రైమ్ బాస్ అరెస్ట్.. 82 ప్రాపర్టీలు సీజ్..యూఏఈ మంత్రి..!!
- అమరావతికి కీలక గుర్తింపు.. 13వ FRRO కేంద్రంగా ఏర్పాటు
- బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్..
- హార్ముజ్ జలసంధిలో అమెరికా అండర్‌వాటర్ డ్రోన్‌ను స్వాధీనం చేసుకున్న ఇరాన్







