అల్ షహీద్ పార్క్ మూడో దశ ప్రారంభోత్సవం.. రెండు రోజుల కార్నివాల్..!!
- September 28, 2026
కువైట్ : అల్ షహీద్ పార్క్ మూడో దశ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని అక్టోబర్ 1, 2 తేదీల్లో రెండు రోజుల పాటు ప్రత్యేక కార్నివాల్, వివిధ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. కుటుంబ సమేతంగా సందర్శించే వారికి సంస్కృతి, కళలు, వినోదం, క్రీడలను మేళవించిన అనుభూతిని అందించేలా కార్యక్రమాలను రూపొందించారు. ఈ వేడుకల్లో అల్-సౌర్ థియేటర్ గుమ్మటంపై ప్రత్యేక లైట్ షోలు, చిన్నారులు, కుటుంబాల కోసం వినోద కార్యక్రమాలు, కువైట్ సంప్రదాయ కళా ప్రదర్శనలు, ఉత్సవ ర్యాలీలు, కళా ప్రదర్శనలు, సృజనాత్మక ఇన్స్టలేషన్లు, వివిధ విజువల్ షోలు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.
క్రీడా కార్యక్రమాల్లో భాగంగా పార్కూర్, స్కేటింగ్ అరేనాల్లో స్థానిక క్రీడాకారులు తమ ప్రతిభను ప్రదర్శించనున్నారు. స్పాన్సర్లు, భాగస్వామ్య సంస్థల ఆధ్వర్యంలోనూ పలు కార్యక్రమాలను నిర్వహించనున్నారు. అల్ షహీద్ పార్క్ తొలి రెండు దశలకు కొనసాగింపుగా మూడో దశలో మరిన్ని ఆధునిక సదుపాయాలు, కొత్త అనుభవాలను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఆధునికతతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ ఈ దశను అభివృద్ధి చేశారు.
తాజా వార్తలు
- ఖతార్ లో ప్రత్యేక వాహన రిజిస్ట్రేషన్ నంబర్లకు దరఖాస్తులు ఆహ్వానం..!!
- అక్టోబర్ 1 నుంచి ఒమన్‌లో 1,546 వస్తువులపై జీరో వ్యాట్..!!
- ఒమన్ లో కన్జుమర్ కాన్ఫిడెన్స్ సర్వే నిర్వహిస్తున్న ఎన్సీఎస్ఐ..!!
- అల్ షహీద్ పార్క్ మూడో దశ ప్రారంభోత్సవం.. రెండు రోజుల కార్నివాల్..!!
- అక్టోబర్ 21న రియాద్ సీజన్ 2026 ప్రారంభం..!!
- బహ్రెయిన్ ఇండియన్ స్కూల్ లో ఆకట్టుకున్న పీస్ డే ప్రోగ్రామ్స్..!!
- 48 గంటల్లో ఐరిష్ క్రైమ్ బాస్ అరెస్ట్.. 82 ప్రాపర్టీలు సీజ్..యూఏఈ మంత్రి..!!
- అమరావతికి కీలక గుర్తింపు.. 13వ FRRO కేంద్రంగా ఏర్పాటు
- బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్..
- హార్ముజ్ జలసంధిలో అమెరికా అండర్‌వాటర్ డ్రోన్‌ను స్వాధీనం చేసుకున్న ఇరాన్







