బహ్రెయిన్ ఇండియన్ స్కూల్ లో ఆకట్టుకున్న పీస్ డే ప్రోగ్రామ్స్..!!
- September 28, 2026
మనామా: భవన్స్ బహ్రెయిన్ ఇండియన్ స్కూల్లో అంతర్జాతీయ శాంతి దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. శాంతి, కరుణ, సానుభూతి, ఐక్యత, సామరస్యంపై విద్యార్థుల్లో అవగాహన కల్పించేలా కార్యక్రమాలను నిర్వహించారు. 8వ తరగతి బ్రహ్మగుప్త విద్యార్థులు ప్రత్యేక అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో ప్రసంగాలు, వార్తా ముఖ్యాంశాల ప్రదర్శన, నృత్యం, మైమ్, ‘పీస్ క్విజ్’తో పాటు కార్యక్రమం వెనుక జరిగిన ఏర్పాట్లపై ప్రత్యేక వీడియోను ప్రదర్శించారు. పరస్పర అవగాహన, గౌరవం, శాంతియుత సహజీవనం వంటి అంశాలను విద్యార్థులు తమ ప్రదర్శనల ద్వారా వివరించారు.
ప్రపంచవ్యాప్తంగా శాంతి స్థాపనకు కృషి చేసిన ప్రముఖులు, శాంతి రాయబారుల సేవలను కూడా కార్యక్రమంలో ప్రస్తావించారు. శాంతి అనేది కేవలం ఒకరోజుకే పరిమితం కాకుండా ప్రతిరోజూ మన మాటలు, చేతలు, ఇతరులతో వ్యవహరించే తీరులో ప్రతిబింబించాల్సిన బాధ్యత అని విద్యార్థులకు వివరించారు.
కిండర్‌గార్టెన్ విద్యార్థులు కూడా శాంతి, ఐక్యతపై నిర్వహించిన వివిధ కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. తెల్లని దుస్తులు ధరించిన చిన్నారులు ఆటలు, ఇంటరాక్టివ్ కార్యక్రమాల ద్వారా దయ, ఐక్యత, సామరస్య విలువలను తెలుసుకున్నారు. ఐక్యతకు ప్రతీకగా రూపొందించిన పావురం పజిల్స్, ‘సెన్స్ ఆర్గాన్ వీల్స్ ఆఫ్ పీస్’ వంటి కార్యక్రమాలు నిర్వహించారు.
ఒక చిరునవ్వు, మంచి మాట లేదా ఆప్యాయతతో కూడిన చిన్న సహాయం కూడా శాంతియుత వాతావరణాన్ని నిర్మించడంలో కీలక పాత్ర పోషిస్తుందని విద్యార్థులకు అవగాహన కల్పించారు. పాఠశాల డైరెక్టర్లు హిమాన్షు వర్మ, రీతూ వర్మ, ప్రిన్సిపల్ సాజీ జాకబ్ విద్యార్థులు, ఉపాధ్యాయులను అభినందించారు. పాఠశాల సమాజంలో శాంతి, సానుభూతి, ఐక్యతతో కూడిన వాతావరణాన్ని పెంపొందించేందుకు చేసిన కృషిని వారు ప్రశంసించారు.
తాజా వార్తలు
- ఖతార్ లో ప్రత్యేక వాహన రిజిస్ట్రేషన్ నంబర్లకు దరఖాస్తులు ఆహ్వానం..!!
- అక్టోబర్ 1 నుంచి ఒమన్‌లో 1,546 వస్తువులపై జీరో వ్యాట్..!!
- ఒమన్ లో కన్జుమర్ కాన్ఫిడెన్స్ సర్వే నిర్వహిస్తున్న ఎన్సీఎస్ఐ..!!
- అల్ షహీద్ పార్క్ మూడో దశ ప్రారంభోత్సవం.. రెండు రోజుల కార్నివాల్..!!
- అక్టోబర్ 21న రియాద్ సీజన్ 2026 ప్రారంభం..!!
- బహ్రెయిన్ ఇండియన్ స్కూల్ లో ఆకట్టుకున్న పీస్ డే ప్రోగ్రామ్స్..!!
- 48 గంటల్లో ఐరిష్ క్రైమ్ బాస్ అరెస్ట్.. 82 ప్రాపర్టీలు సీజ్..యూఏఈ మంత్రి..!!
- అమరావతికి కీలక గుర్తింపు.. 13వ FRRO కేంద్రంగా ఏర్పాటు
- బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్..
- హార్ముజ్ జలసంధిలో అమెరికా అండర్‌వాటర్ డ్రోన్‌ను స్వాధీనం చేసుకున్న ఇరాన్







