అక్టోబర్ 21న రియాద్ సీజన్ 2026 ప్రారంభం..!!

- September 28, 2026 , by Maagulf
అక్టోబర్ 21న రియాద్ సీజన్ 2026 ప్రారంభం..!!

రియాద్: సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో ప్రతిష్ఠాత్మక రియాద్ సీజన్ 2026 అక్టోబర్ 21న ప్రారంభం కానుంది. మొత్తం 10 వారాల పాటు వినోదం, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలతో సందడి కొనసాగనుంది. జనరల్ ఎంటర్‌టైన్‌మెంట్ అథారిటీ (GEA) బోర్డు చైర్మన్ టర్కీ అల్-షేఖ్ ఈ విషయాన్ని ప్రకటించారు. ‘బిగ్ టైమ్’ అనే నినాదంతో రియాద్ సీజన్ ఏడో ఎడిషన్‌ను నిర్వహించనున్నారు. ప్రపంచస్థాయి, ప్రాంతీయ ఆకర్షణలతో భారీ స్థాయిలో కార్యక్రమాలను సిద్ధం చేస్తున్నారు.

క్రీడా విభాగంలో ప్రముఖ బాక్సింగ్, రెజ్లింగ్ పోటీలు, UFC బౌట్లు, అలాగే ప్రతిష్ఠాత్మక సిక్స్ కింగ్స్ స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. అదేవిధంగా సౌదీ, అరబ్, అంతర్జాతీయ స్థాయి ప్రముఖ కళాకారుల మ్యూజిక్ కాన్సర్టులు, థియేటర్ ప్రదర్శనలు, స్టాండప్ కామెడీ షోలు నిర్వహించనున్నారు. చిన్నారులు, కుటుంబాల కోసం కూడా ప్రత్యేక వినోద కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు.

రియాద్ సీజన్‌లో ప్రధాన జోన్‌లలో ఒకటైన బులేవార్డ్ వరల్డ్ మరోసారి సందర్శకులను ఆకట్టుకోనుంది. ఒకే ప్రదేశంలో ప్రపంచంలోని వివిధ దేశాల సంస్కృతులను పరిచయం చేసే ఈ జోన్‌లో నెదర్లాండ్స్, పోర్చుగల్, యెమెన్ దేశాలకు చెందిన మూడు కొత్త పెవిలియన్లను ఏర్పాటు చేయనున్నారు. దీంతో పాటు ది గ్రోవ్స్, ఫార్మర్స్ మార్కెట్, వయా రియాద్‌లో అనా అరేబియా ఎగ్జిబిషన్ సహా అనేక కార్యక్రమాలు ఈసారి హైలెట్ గా నిల్వనున్నాయని నిర్వాహకులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com