అల్ షహీద్ పార్క్ మూడో దశ ప్రారంభోత్సవం.. రెండు రోజుల కార్నివాల్..!!

- September 28, 2026 , by Maagulf
అల్ షహీద్ పార్క్ మూడో దశ ప్రారంభోత్సవం.. రెండు రోజుల కార్నివాల్..!!

కువైట్ : అల్ షహీద్ పార్క్ మూడో దశ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని అక్టోబర్ 1, 2 తేదీల్లో రెండు రోజుల పాటు ప్రత్యేక కార్నివాల్, వివిధ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. కుటుంబ సమేతంగా సందర్శించే వారికి సంస్కృతి, కళలు, వినోదం, క్రీడలను మేళవించిన అనుభూతిని అందించేలా కార్యక్రమాలను రూపొందించారు. ఈ వేడుకల్లో అల్-సౌర్ థియేటర్ గుమ్మటంపై ప్రత్యేక లైట్ షోలు, చిన్నారులు, కుటుంబాల కోసం వినోద కార్యక్రమాలు, కువైట్ సంప్రదాయ కళా ప్రదర్శనలు, ఉత్సవ ర్యాలీలు, కళా ప్రదర్శనలు, సృజనాత్మక ఇన్‌స్టలేషన్లు, వివిధ విజువల్ షోలు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.

క్రీడా కార్యక్రమాల్లో భాగంగా పార్కూర్, స్కేటింగ్ అరేనాల్లో స్థానిక క్రీడాకారులు తమ ప్రతిభను ప్రదర్శించనున్నారు. స్పాన్సర్లు, భాగస్వామ్య సంస్థల ఆధ్వర్యంలోనూ పలు కార్యక్రమాలను నిర్వహించనున్నారు. అల్ షహీద్ పార్క్ తొలి రెండు దశలకు కొనసాగింపుగా మూడో దశలో మరిన్ని ఆధునిక సదుపాయాలు, కొత్త అనుభవాలను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఆధునికతతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ ఈ దశను అభివృద్ధి చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com