ఒమన్ లో కన్జుమర్ కాన్ఫిడెన్స్ సర్వే నిర్వహిస్తున్న ఎన్‌సీఎస్‌ఐ..!!

- September 28, 2026 , by Maagulf
ఒమన్ లో కన్జుమర్ కాన్ఫిడెన్స్ సర్వే నిర్వహిస్తున్న ఎన్‌సీఎస్‌ఐ..!!

మస్కట్: ఒమన్ నేషనల్ సెంటర్ ఫర్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ (NCSI) 2026 మూడో త్రైమాసికానికి సంబంధించి 51వ వినియోగదారుల కాన్ఫిడెన్స్ సర్వేను నిర్వహిస్తోంది. సెప్టెంబర్  30 వరకు ఈ సర్వే కొనసాగనుంది. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులపై ఒమన్ పౌరుల అభిప్రాయాలను తెలుసుకోవడం, భవిష్యత్తులో ఆర్థిక పరిణామాలపై వినియోగదారుల అంచనాలను అర్థం చేసుకోవడం సర్వే ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు.

ధరల స్థాయి, ఉపాధి అవకాశాలు, జీవన వ్యయం, ఆర్థిక విధానాలు, ఖర్చులు, వినియోగ సామర్థ్యం వంటి వివిధ ఆర్థిక అంశాలపై ప్రజల అభిప్రాయాలు, వైఖరులను తెలుసుకునేందుకు ఈ సర్వేను నిర్వహిస్తున్నారు. రాబోయే 12 నెలల్లో ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయన్న ప్రజల ఆశావాద స్థాయిని కూడా సర్వే అంచనా వేయనుంది.

ఈ సర్వేలో 18 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న కనీసం 1,500 మంది ఒమన్ పౌరులను భాగస్వామ్యం చేయనున్నారు. ఫలితాలు దేశవ్యాప్తంగా ప్రజల అభిప్రాయాలను ప్రతిబింబించేలా భౌగోళిక ప్రాంతాలు, వయస్సు, విద్యా స్థాయిల ఆధారంగా ప్రతినిధి నమూనాను ఎంపిక చేస్తున్నారు. ఆర్థిక పరిస్థితులపై ప్రజల అభిప్రాయాలు, వినియోగ ధోరణులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు NCSI నిర్వహించే కీలక గణాంక సాధనాల్లో ఈ వినియోగదారుల విశ్వాస సర్వే ఒకటిగా ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com