ఖతార్ లో ప్రత్యేక వాహన రిజిస్ట్రేషన్ నంబర్లకు దరఖాస్తులు ఆహ్వానం..!!

- September 28, 2026 , by Maagulf
ఖతార్ లో ప్రత్యేక వాహన రిజిస్ట్రేషన్ నంబర్లకు దరఖాస్తులు ఆహ్వానం..!!

దోహా: ప్రత్యేక వాహన రిజిస్ట్రేషన్ నంబర్లను విక్రయించేందుకు ఖతార్ జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ చర్యలు చేపట్టింది. కొత్త ప్రత్యేక నంబర్లను ‘Sooum’ యాప్ ద్వారా అందుబాటులోకి తీసుకురానుంది. అక్టోబర్ 1న ఉదయం 10 గంటలకు ప్రత్యేక నంబర్ల కోసం దరఖాస్తు విభాగం యాక్టివేట్ అవుతుందని ట్రాఫిక్ విభాగం సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.

ఆసక్తి ఉన్నవారు Sooum యాప్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి వ్యక్తం చేసిన 72 గంటల్లోగా సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది. ఆసక్తి వ్యక్తం చేసే గడువు ముగిసిన తర్వాత, అర్హులైన దరఖాస్తుదారుల మధ్య 24 గంటల పాటు అంతర్గత వేలం నిర్వహిస్తారు. ఒక నంబర్‌పై ఒక్క వ్యక్తి మాత్రమే ఆసక్తి వ్యక్తం చేస్తే, ఆ నంబర్‌ను నిర్ణయించిన ధరకు అతనికే కేటాయిస్తారు.

అదే నంబర్ కోసం ఒకరి కంటే ఎక్కువ మంది ఆసక్తి వ్యక్తం చేస్తే, వారందరి మధ్య అంతర్గత వేలం నిర్వహించి అత్యధిక బిడ్ వేసిన వ్యక్తికి ఆ నంబర్‌ను కేటాయిస్తారు. అందుబాటులో ఉన్న ప్రత్యేక వాహన రిజిస్ట్రేషన్ నంబర్ల వివరాలను యాప్‌లో చూడవచ్చని తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com