కువైట్లో వర్షాలు.. తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- October 02, 2026
కువైట్ : కువైట్లో రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గనున్నాయి. అయితే వాతావరణం వేడిగా, కొంత తేమతో కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా తీర ప్రాంతాల్లో తేమ ఎక్కువగా ఉండే అవకాశం ఉందని పేర్కొంది. వచ్చే రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40°C నుంచి 43°C మధ్య నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
నేటి నుంచి అక్కడక్కడా వర్షాలు
వాతావరణ శాఖ డైరెక్టర్ దిరార్ అల్-అలీ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈరోజు మధ్యాహ్నం నుంచి అక్కడక్కడా వర్షాలు కురిసే స్వల్ప అవకాశం ఉంది. ఆదివారం కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. గాలులు తేలికపాటి నుంచి మోస్తరు వేగంతో వీస్తాయని, అప్పుడప్పుడు వేగం పుంజుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. వాతావరణ పరిస్థితుల ప్రభావంతో సముద్రంలో అలలు 6 అడుగులకు పైగా ఎగిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. సముద్ర కార్యకలాపాలు నిర్వహించే వారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
పొగమంచుకు అవకాశం
శనివారం సాయంత్రం నుంచి ఆదివారం ఉదయం వరకు కొన్ని ప్రాంతాల్లో పొగమంచు ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. రాత్రి సమయంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 24°C నుంచి 27°C మధ్య నమోదయ్యే అవకాశం ఉంది. వాతావరణంలో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉన్నందున ప్రజలు తాజా సమాచారం కోసం అధికారిక వాతావరణ శాఖ ప్రకటనలను ఎప్పటికప్పుడు ఫాల్లో కావాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- Four astronauts reach International Space Station in record time
- సౌదీలో హౌతీ బాలిస్టిక్ మిసైల్ కూల్చివేత..!!
- అక్టోబర్ నెలంతా దేశవ్యాప్త నిరసనలు.. CJP కీలక పిలుపు
- పైలట్ స్మిత్ మచ్చర్ కోలుకుంటున్నారు..భారత రాయబారి..!!
- మదీనాలో హౌతీ దాడి.. తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- షార్జా జ్యువెలరీ షోలో ప్రపంచంలోనే ఎత్తైన బంగారు బార్..
- కువైట్లో వర్షాలు.. తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- భారతీయులకు గుడ్ న్యూస్..హెచ్-1బి వీసా ఫీజు పై కీలక నిర్ణయం
- మహాత్ముడికి ప్రధాని మోడీ నివాళి







