సౌదీలో హౌతీ బాలిస్టిక్ మిసైల్ కూల్చివేత..!!
- October 02, 2026
రియాద్: సౌదీ అరేబియాలోని దక్షిణ అసీర్ ప్రాంతంలోని ఖమీస్ ముషైత్ వైపు ప్రయోగించిన బాలిస్టిక్ మిసైల్ ని అడ్డుకున్నట్లు సౌదీ అధికారులు తెలిపారు. ఉగ్రవాద హౌతీ మిలీషియా పౌర నివాస ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ఈ మిసైల్ ని ప్రయోగించినట్లు అధికారులు వెల్లడించారు.
మిసైల్ ని అడ్డుకున్న అనంతరం దాని శకలాలు కిందపడటంతో ఖమీస్ ముషైత్ సివిల్ డిఫెన్స్ బృందాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. క్షిపణి శకలాలు పడటంతో పలు భవనాలు, వాహనాలకు స్వల్ప స్థాయిలో ఆస్తి నష్టం జరిగినట్లు సౌదీ జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ డిఫెన్స్ వెల్లడించింది. ఘటన అనంతరం సంబంధిత అధికారులు అత్యవసర చర్యలు చేపట్టినట్లు సివిల్ డిఫెన్స్ అధికారులు తెలిపారు. ప్రజల భద్రతకు అవసరమైన చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- Four astronauts reach International Space Station in record time
- సౌదీలో హౌతీ బాలిస్టిక్ మిసైల్ కూల్చివేత..!!
- అక్టోబర్ నెలంతా దేశవ్యాప్త నిరసనలు.. CJP కీలక పిలుపు
- పైలట్ స్మిత్ మచ్చర్ కోలుకుంటున్నారు..భారత రాయబారి..!!
- మదీనాలో హౌతీ దాడి.. తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- షార్జా జ్యువెలరీ షోలో ప్రపంచంలోనే ఎత్తైన బంగారు బార్..
- కువైట్లో వర్షాలు.. తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- భారతీయులకు గుడ్ న్యూస్..హెచ్-1బి వీసా ఫీజు పై కీలక నిర్ణయం
- మహాత్ముడికి ప్రధాని మోడీ నివాళి







