సైన్ బోర్డు పై హిందీ పదాలు..ఇద్దరు ఇంజనీర్లను సస్పెండ్ చేసిన తమిళనాడు ప్రభుత్వం!
- October 02, 2026
చెన్నై: తమిళనాడులో ద్విభాషా విధానంపై మరోసారి తీవ్ర చర్చ మొదలైంది. నిబంధనలను ఉల్లంఘిస్తూ రాష్ట్రంలోని ఓ రహదారి సైన్ బోర్డుపై హిందీ పదాలను వినియోగించడం పెద్ద వివాదానికి దారితీసింది. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన తమిళనాడు ప్రభుత్వం ఇద్దరు అధికారులపై సస్పెన్షన్ వేటు వేసింది.
సైన్ బోర్డు పై హిందీ అక్షరాలు
తూత్తుకుడి జిల్లాలోని సాత్తాన్‌కుళం–నజరేత్ రాష్ట్ర రహదారి పై కొత్తగా ఏర్పాటు చేసిన సైన్ బోర్డుపై తమిళం, ఇంగ్లిష్తో పాటు హిందీ భాషను కూడా ఉపయోగించారు. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో అధికారులు తక్షణమే స్పందించి సైన్ బోర్డుపై ఉన్న హిందీ పదాలను తొలగించారు.
రాష్ట్ర ద్విభాషా విధానాన్ని ఉల్లంఘించినందుకు గాను హైవేస్ శాఖకు చెందిన అసిస్టెంట్ డివిజనల్ ఇంజినీర్, అసిస్టెంట్ ఇంజినీర్లను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అంతేకాకుండా, ఈ ఘటనపై శాఖాపరమైన విచారణకు ఆదేశించింది. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతమైతే మరింత కఠిన చర్యలు ఉంటాయని ప్రభుత్వం హెచ్చరించింది.
తమిళనాడులో ద్విభాషా విధానం నేపథ్యం
తమిళనాడులో 1965లో జరిగిన హిందీ వ్యతిరేక ఉద్యమాల అనంతరం ‘ద్విభాషా విధానం’ రాజకీయంగా, సామాజికంగా ఎంతో ప్రాధాన్యం సంతరించుకుంది. 1968లో అప్పటి ముఖ్యమంత్రి సి.ఎన్.అన్నాదురై నేతృత్వంలోని ప్రభుత్వం ఈ ద్విభాషా విధానానికి సంబంధించిన తీర్మానాన్ని ఆమోదించింది.
ఆ తీర్మానం ప్రకారం రాష్ట్రంలో హిందీ, సంస్కృతం వంటి ఇతర భాషలకు పాఠ్యప్రణాళికలో గానీ, అధికారిక వినియోగంలో గానీ చోటు లేకుండా తమిళం, ఇంగ్లిష్లను మాత్రమే ప్రాథమిక భాషలుగా కొనసాగిస్తున్నారు. ప్రభుత్వాలు మారినా దశాబ్దాలుగా ఈ విధానం ఇక్కడ కచ్చితంగా అమలువుతోంది.
తాజా వార్తలు
- ఫ్లైదుబాయ్ ఘటన పై ఇజ్రాయెల్ తీవ్ర వ్యాఖ్యలు
- యూఏఈలో ఇన్వెస్ట్మెంట్ మోసాలపై కీలక హెచ్చరిక
- సీనియర్ సిటిజన్లకు ఉచిత ఆర్టీసీ బస్ పాసులు..పరిశీలనలో ప్రభుత్వం!
- సైన్ బోర్డు పై హిందీ పదాలు..ఇద్దరు ఇంజనీర్లను సస్పెండ్ చేసిన తమిళనాడు ప్రభుత్వం!
- దేశ నిర్మాణంలో నిర్మల సీతారామన్ కీలక పాత్ర.. సీఎం చంద్రబాబు ప్రశంసలు
- భారతి మాతాజీ అస్తమయం
- సౌదీలో అక్టోబర్ 7న నేషనల్ గ్రీనింగ్ సీజన్ ప్రారంభం..!!
- ఖతార్‌లో పటిష్టంగా సమాచార భద్రతా నిబంధనల అమలు..!!
- ఒమన్ న్యాయ వ్యవస్థలో డిజిటల్ సేవల విస్తరణ..!!
- మక్కాలో వేధింపులు.. భయాందోళనకు గురిచేసిన వ్యక్తి అరెస్ట్..!!







