‘హనుమాన్ అంశ్’ తెలుగు ట్రైలర్ విడుదల
- October 06, 2026
ఎటువంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా విడుదలై బాక్సాఫీస్ వద్ద యావత్ దేశాన్ని ఆశ్చర్యపరిచిన అద్భుతమైన ఆధ్యాత్మిక చిత్రం ‘హనుమాన్ అంశ్’ (Hanuman Ansh). ఇప్పుడు ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. కేవలం రూ. 2 కోట్ల స్వల్ప బడ్జెట్తో తెరకెక్కి, ఏకంగా రూ. 423 కోట్ల వసూళ్లతో ఇండస్ట్రీని షేక్ చేసిన ఈ సినిమాను, తెలుగులో ‘కేజీఎఫ్’, ‘సలార్’ వంటి బ్రహ్మాండమైన చిత్రాల నిర్మాణ సంస్థ అయిన హోంబలే ఫిలింస్ విడుదల చేస్తోంది. అక్టోబర్ 9న ఈ సినిమా థియేటర్లలో గ్రాండ్గా విడుదల కానుండగా, తాజాగా చిత్ర యూనిట్ తెలుగు ట్రైలర్ను విడుదల చేసింది.
ఆధ్యాత్మిక గురువు నీమ్ కరోలీ బాబా జీవిత కథతో అద్భుతమైన ట్రైలర్
ప్రముఖ ఆధ్యాత్మిక గురువు నీమ్ కరోలీ బాబా జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా రూపుదిద్దుకుంది. తాజాగా విడుదలైన తెలుగు ట్రైలర్ ఎంతో ఆహ్లాదకరంగా, వీక్షకులను కట్టిపడేసేలా ఉంది. బ్రిటిష్ కాలం నాటి నాటి వాతావరణం, ఒక సామాన్య వ్యక్తి సన్యాసిగా మారే ప్రయాణం, ప్రజలతో ఆయన మాట్లాడే చమత్కారమైన, స్ఫూర్తిదాయకమైన సంభాషణలను ట్రైలర్లో అత్యద్భుతంగా చూపించారు. భార్య ఆయన్ను వదిలిపెట్టి వెళ్లే సన్నివేశాలు, అలాగే చివర్లో హనుమాన్ విగ్రహ ప్రతిష్ఠ చేసి బాబా నిష్క్రమణకు సిద్ధమయ్యే భావోద్వేగ దృశ్యాలు ప్రేక్షకులను కంటతడి పెట్టించేలా ఉన్నాయి.
భారీ అంచనాల మధ్య అక్టోబర్ 9న థియేటర్లలోకి..
తొలుత ఈ సినిమా తెలుగు హక్కులను ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దక్కించుకుంటారనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే, చివరకు హోంబలే ఫిలింస్ సంస్థ రంగంలోకి దిగి ఈ మూవీ హక్కులను సొంతం చేసుకుంది. అత్యంత భారీ స్థాయిలో పాన్ ఇండియా రేంజ్లో దీన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. పెట్టిన పెట్టుబడికి 200 రెట్లకు పైగా వసూళ్లు సాధించి సరికొత్త చరిత్ర సృష్టించిన ఈ ఆధ్యాత్మిక డ్రామా, తెలుగు బాక్సాఫీస్ వద్ద కూడా అదే స్థాయి విజయాన్ని నమోదు చేస్తుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.
తాజా వార్తలు
- జ్ఞానేశ్ కుమార్ పై రాహుల్ గాంధీ ఫైర్
- ఢిల్లీలో అక్టోబర్ 17న శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవి పూజ
- డాలస్ లో మహత్మాగాంధీ మెమోరియల్ వద్ద ఘనంగా 157వ గాంధీ జయంతి వేడుకలు
- దుబాయ్లో ప్రతిభావంతులైన ఉపాధ్యాయులకు గోల్డెన్ వీసాలు
- ముగ్గురు శాస్త్రవేత్తలకు 2026 నోబెల్ వైద్య శాస్త్ర పురస్కారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్ ధైర్యాన్ని ప్రశంసించిన బీజేపీ నేత కౌసర్ జహాన్
- పోలీస్ అమరవీరుల దినోత్సవానికి సిద్ధమవుతున్న గోషామహల్ స్టేడియం
- నదిలో రెండు పడవలు ఢీ..30 మంది మృతి
- భారత్–యూఏఈ ఆర్థిక సంబంధాల బలోపేతం పై చర్చలు
- సౌదీలో ఐస్క్రీమ్ షాపులకు కొత్త నిబంధనలు..!!







