ఫుజైరాలో బావిలో పడిన చిన్నారి, డొమెస్టిక్ వర్కర్ సేఫ్..!!
- October 06, 2026
ఫుజైరా: ఇంటి వద్ద ఉన్న బావిలో చిన్నారి, డొమెస్టిక్ వర్కర్ పడిపోయిన ఘటనలో ఇద్దరూ సురక్షితంగా ఉన్నట్లు ఫుజైరా సివిల్ డిఫెన్స్ అధికారులు తెలిపారు. ఫుజైరా సివిల్ డిఫెన్స్ డిప్యూటీ డైరెక్టర్ కల్నల్ ఖాలిద్ రబీ అల్ హమ్మౌది చిన్నారి కుటుంబాన్ని పరామర్శించారు.
చిన్నారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడినందుకు కుటుంబ సభ్యులను అభినందించారు. అనంతరం ఫుజైరా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న డొమెస్టిక్ వర్కర్‌ను కూడా ఆయన పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఇద్దరూ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రజలతో సన్నిహితంగా ఉంటూ మానవతా పరమైన ఘటనల్లో బాధిత కుటుంబాలను పరామర్శించడం, వారి పరిస్థితిని తెలుసుకోవడం ద్వారా ఫుజైరా సివిల్ డిఫెన్స్ తన సామాజిక బాధ్యతను కొనసాగిస్తోందని అధికారులు తెలిపారు.
బావుల వద్ద జాగ్రత్తలు తప్పనిసరి
ఇళ్ల యజమానులు, వ్యవసాయ క్షేత్రాల యజమానులు, భూముల యజమానులు తమ పరిధిలోని బావులను సురక్షితంగా మూసివేసి, తగిన రక్షణ చర్యలు చేపట్టాలని సివిల్ డిఫెన్స్ సూచించింది. బావుల చుట్టూ స్పష్టమైన అడ్డంకులు ఏర్పాటు చేయడంతో పాటు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని కోరింది. తెరిచి ఉన్న బావులు చిన్నారులతో పాటు పెద్దలకు కూడా తీవ్ర ప్రమాదాన్ని కలిగిస్తాయని హెచ్చరించింది. ప్రమాదాలను నివారించేందుకు ముందస్తు భద్రతా చర్యలు తీసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని సివిల్ డిఫెన్స్ పేర్కొంది.
తాజా వార్తలు
- భారత్-స్విట్జర్లాండ్ మధ్య 5 కీలక ఒప్పందాలు.. ఏంటంటే?
- సౌదీలో మరో ఐదు రోజులపాటు వర్షాలు.. ప్రజలకు సివిల్ డిఫెన్స్ హెచ్చరిక..!!
- క్రాస్ బార్డర్ నేరాలపై GCC దేశాల మధ్య మరింత సహకారం..!!
- ఖతార్‌లో ట్రాఫిక్ ప్రమాదాలు.. కారణాలపై హోం మినిస్ట్రీ కీలక ప్రకటన..!!
- ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే డెలివరీ సంస్థలపై చర్యలు..!!
- పర్యావరణ చట్టం.. బిల్లుపై చర్చించిన ఒమన్ షురా కౌన్సిల్..!!
- ఫుజైరాలో బావిలో పడిన చిన్నారి, డొమెస్టిక్ వర్కర్ సేఫ్..!!
- జ్ఞానేశ్ కుమార్ పై రాహుల్ గాంధీ ఫైర్
- ఢిల్లీలో అక్టోబర్ 17న శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవి పూజ
- డాలస్ లో మహత్మాగాంధీ మెమోరియల్ వద్ద ఘనంగా 157వ గాంధీ జయంతి వేడుకలు







