పర్యావరణ చట్టం.. బిల్లుపై చర్చించిన ఒమన్ షురా కౌన్సిల్..!!
- October 06, 2026
మస్కట్: ప్రభుత్వం షురా కౌన్సిల్‌కు పంపిన పర్యావరణ చట్టం బిల్లుపై ఒమన్ షురా కౌన్సిల్ ఆరోగ్య, సామాజిక వ్యవహారాల కమిటీ సోమవారం చర్చించింది. పర్యావరణ ప్రాధికార సంస్థ (Environment Authority), ఎన్విరాన్‌మెంట్ సొసైటీ ఆఫ్ ఒమన్ (ESO) నిపుణులతో కమిటీ సమావేశమై బిల్లులోని పలు అంశాలపై అభిప్రాయాలు, సూచనలు స్వీకరించింది. కమిటీ చైర్మన్ హమేద్ అల్ సవాఖ్రూన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పర్యావరణ పరిరక్షణ, జీవ వైవిధ్యం, సహజ వనరుల సంరక్షణ, పర్యావరణ అవగాహన పెంపు వంటి అంశాల్లో ESO చేస్తున్న కృషిని కమిటీ ప్రశంసించింది.
బిల్లులోని పలు నిబంధనలపై ESO నిపుణులు తమ అభిప్రాయాలు, పరిశీలనలు వెల్లడించారు. కొన్ని అంశాల్లో సవరణలు చేయాలని సూచించడంతో పాటు, ఆ ప్రతిపాదనల వెనుక ఉన్న కారణాలు, వాటి చట్టపరమైన, ఆచరణాత్మక ప్రభావాలపై కమిటీ సభ్యులు చర్చించారు.అనంతరం పర్యావరణ ప్రాధికార సంస్థ నిపుణులతోనూ కమిటీ సమావేశమైంది. పర్యావరణ పరిరక్షణ, సహజ వనరులు, జీవ వైవిధ్యాన్ని కాపాడటం, పర్యావరణ నిబంధనల అమలును బలోపేతం చేయడంలో సంస్థ చేస్తున్న కృషిని కమిటీ అభినందించింది.
పర్యావరణ పరిరక్షణకు సమగ్ర చట్టపరమైన వ్యవస్థ ఏర్పాటు చేయడం, సహజ వనరులను సుస్థిరంగా వినియోగించడం, పర్యావరణానికి హాని కలిగించే కార్యకలాపాలను నియంత్రించడం, సంబంధిత సంస్థల బాధ్యతలు, అధికారాలను స్పష్టీకరించడం వంటి లక్ష్యాలపై సమావేశంలో ప్రధానంగా చర్చించారు.అలాగే ప్రతిపాదిత నిబంధనలను అమలు చేసే విధానం, ప్రస్తుత ఆచరణాత్మక పరిస్థితులతో వాటి అనుసరణ, చట్టంలోని నిబంధనలు స్పష్టంగా ఉండేలా చూడటం వంటి అంశాలను కూడా పరిశీలించారు. ఆర్థిక, సామాజిక అభివృద్ధి అవసరాలు, పర్యావరణ సుస్థిరత లక్ష్యాల మధ్య సమతుల్యత సాధించేలా చట్టపరమైన వ్యవస్థను రూపొందించాల్సిన అవసరాన్ని కమిటీ ప్రస్తావించింది.
పర్యావరణ చట్టం బిల్లుపై వివిధ సంస్థలు, నిపుణుల అభిప్రాయాలను తీసుకోవడం షురా కౌన్సిల్ శాసనపరమైన బాధ్యతల్లో భాగమని కమిటీ తెలిపింది. నిపుణుల సూచనలను పరిగణనలోకి తీసుకుని చట్టంలోని ప్రతిపాదిత నిబంధనలపై సమగ్ర అభిప్రాయాన్ని రూపొందించనున్నట్లు పేర్కొంది.
ఒమన్‌లో పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన చట్టపరమైన వ్యవస్థను మరింత బలోపేతం చేయడం, పర్యావరణ నిబంధనల అమలును పెంచడం, భవిష్యత్ తరాల కోసం సహజ వనరులను కాపాడటం ఈ బిల్లు ప్రధాన ఉద్దేశాల్లో ఉన్నాయని వెల్లడించింది. కాగా, ఒమన్ కౌన్సిల్ చట్టంలోని ఆర్టికల్ 49 ప్రకారం.. మంత్రుల మండలి నుంచి వచ్చిన బిల్లును షురా కౌన్సిల్ మూడు నెలల్లోగా ఆమోదించాలి లేదా సవరణలు చేయాలి. అనంతరం బిల్లు స్టేట్ కౌన్సిల్‌కు వెళ్తుంది. అక్కడ 45 రోజుల్లోగా ఆమోదం లేదా సవరణలపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- స్కూల్ ప్రాంగణంలో పిల్లల ఫొటోలు తీస్తే భారీ జరిమానా.. తల్లిదండ్రులకు హెచ్చరిక
- భారత్-స్విట్జర్లాండ్ మధ్య 5 కీలక ఒప్పందాలు.. ఏంటంటే?
- సౌదీలో మరో ఐదు రోజులపాటు వర్షాలు.. ప్రజలకు సివిల్ డిఫెన్స్ హెచ్చరిక..!!
- క్రాస్ బార్డర్ నేరాలపై GCC దేశాల మధ్య మరింత సహకారం..!!
- ఖతార్‌లో ట్రాఫిక్ ప్రమాదాలు.. కారణాలపై హోం మినిస్ట్రీ కీలక ప్రకటన..!!
- ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే డెలివరీ సంస్థలపై చర్యలు..!!
- పర్యావరణ చట్టం.. బిల్లుపై చర్చించిన ఒమన్ షురా కౌన్సిల్..!!
- ఫుజైరాలో బావిలో పడిన చిన్నారి, డొమెస్టిక్ వర్కర్ సేఫ్..!!
- జ్ఞానేశ్ కుమార్ పై రాహుల్ గాంధీ ఫైర్
- ఢిల్లీలో అక్టోబర్ 17న శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవి పూజ







