తిరుమలలో ఈ నెల 11 నుంచి 20 వరకు వీఐపీ దర్శనాలు రద్దు
- October 06, 2026
తిరుమల: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) భక్తులకు ఒక కీలకమైన హెచ్చరిక జారీ చేసింది. ఉత్సవాల సమయంలో శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తుల రద్దడిని క్రమబద్ధీకరించేందుకు, అందరికీ సులభంగా స్వామివారి దర్శనం కల్పించే ఉద్దేశంతో బ్రహ్మోత్సవాల రోజుల్లో పలు రకాల ప్రత్యేక దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.
ఈ నెల 11 నుంచి 20 వరకు ప్రత్యేక దర్శనాల రద్దు మరియు ప్రొటోకాల్ నిబంధనలు
బ్రహ్మోత్సవాలు జరిగే ఈ నెల 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ప్రొటోకాల్ కలిగిన ప్రముఖులకు మినహా మిగతా అన్ని రకాల ప్రత్యేక దర్శనాలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ స్పష్టం చేసింది. ఇందులో భాగంగా వీఐపీ బ్రేక్ దర్శనాలతో పాటు, వృద్ధులు, దివ్యాంగులు, అలాగే చంటి పిల్లల తల్లిదండ్రుల కోసం కేటాయించే ప్రత్యేక దర్శనాలను కూడా ఈ పది రోజుల పాటు పూర్తిగా రద్దు చేసినట్లు వెల్లడించింది.
ఎన్ఆర్ఐ, డిఫెన్స్ దర్శనాలు బంద్
సామాన్య భక్తులకు పెద్దపీట వేసే క్రమంలోనే ఎన్ఆర్ఐ (NRI) మరియు డిఫెన్స్ సిబ్బందికి సంబంధించిన ప్రత్యేక దర్శనాలను కూడా ఈ సమయంలో నిలిపివేస్తున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. మరోవైపు, ఈ బ్రహ్మోత్సవాల కాలానికి సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం (Special Entry Darshan) ఆన్లైన్ టికెట్లను రేపు ఉదయం 10 గంటలకు అధికారిక వెబ్సైట్లో విడుదల చేయనున్నట్లు టీటీడీ పేర్కొంది. భక్తులు ఈ మార్పులను గమనించి తమ యాత్రను ప్రణాళిక చేసుకోవాలని సూచించారు.
తాజా వార్తలు
- బైక్‌లు, క్యాంప్‌సైట్ అద్దె పేరుతో ఆన్లైన్ మోసాలు..
- దుబాయ్‌లో ఘనంగా తెలుగు చార్టర్డ్ అకౌంటెంట్ల వనభోజనాలు.. 350 మందికి పైగా హాజరు
- బహ్రెయిన్‌పై ఇరాన్ దాడిని ఖండించిన ఖతార్
- యెమెన్‌లో వారం రోజుల్లో 1,269 పేలుడు పదార్థాలను నిర్వీర్యం చేసిన సౌదీ మసామ్ ప్రాజెక్టు
- లిబియాలో రష్యా నౌకపై డ్రోన్ దాడి అనుమానం.. బెంఘాజీ నౌకాశ్రయంలో భారీ పేలుడు
- రష్యా పౌరుడిని ఎయిర్ లిఫ్ట్ చేసిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- సౌదీలో అక్రమ నివాసులపై భారీ చర్యలు..!!
- ఖతార్‌లో ఇక పేపర్ సిక్‌లీవ్ సర్టిఫికెట్లకు సెలవు..!
- కువైట్‌లో 10 మంది అరెస్ట్, 6 వాహనాలు స్వాధీనం..!!
- ఇరాన్ దాడులపై UN కు బహ్రెయిన్ ఫిర్యాదు..!!







