జాతీయ రహదారి పనులపై ఎంపీ బాలశౌరి సమీక్ష
- October 06, 2026
మచిలీపట్నం: మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి తన క్యాంపు కార్యాలయంలో నేషనల్ హైవే అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పార్లమెంట్ పరిధిలో కొనసాగుతున్న రహదారుల నిర్మాణ పనుల పురోగతిపై అధికారులతో చర్చించారు.
ప్రధానంగా గుడివాడ ఫ్లైఓవర్ నిర్మాణ పనులు, గుడివాడ పట్టణంలోని రోడ్డు పనులు, నందివాడ మండలం పుట్టంగుంట వద్ద బుడమేరు వాగుపై నిర్మించనున్న బ్రిడ్జి పనులపై సమీక్ష నిర్వహించారు.
పనుల పురోగతి, ఎదురవుతున్న సమస్యలు తదితర అంశాలను అధికారులను అడిగి తెలుసుకున్న ఎంపీ బాలశౌరి, అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు.
ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యాలు కల్పించేలా నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ నిర్ణీత సమయంలో పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు.
తాజా వార్తలు
- భారత మహిళల జట్టు కెప్టెన్‌గా స్మృతి మంధాన
- జాతీయ రహదారి పనులపై ఎంపీ బాలశౌరి సమీక్ష
- ‘దాదా’- మైసూరులో షూటింగ్ పునః ప్రారంభించిన బాలకృష్ణ
- విజయవాడ ఉత్సవ్–2026కు తమిళనాడు ముఖ్యమంత్రికి ఆహ్వానం
- యూఏఈ-భారత్ విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్..
- తిరుమలలో ఈ నెల 11 నుంచి 20 వరకు వీఐపీ దర్శనాలు రద్దు
- ఫోన్ స్కామ్‌తో Dh11.8 మిలియన్ మోసం.. ఇద్దరిని అరెస్ట్ చేసిన దుబాయ్ పోలీసులు
- ఒమన్ సమీపంలో ట్యాంకర్‌పై దాడి..12 మందికి గాయాలు
- రాహుల్ గాంధీ, ప్రియాంకను అదుపులోకి తీసుకున్న పోలీసులు
- గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వీక్ 2026కు యూఏఈలో శ్రీకారం







