వికలాంగులు, వృద్ధులకు ఆర్థిక సేవలు.. ఖతార్ సెంట్రల్ బ్యాంక్ కీలక ఆదేశాలు..!!

- October 07, 2026 , by Maagulf
వికలాంగులు, వృద్ధులకు ఆర్థిక సేవలు.. ఖతార్ సెంట్రల్ బ్యాంక్ కీలక ఆదేశాలు..!!

దోహా: వికలాంగులు, వృద్ధులకు ఆర్థిక సేవలను మరింత సులభంగా అందుబాటులోకి తీసుకురావడానికి ఖతార్ సెంట్రల్ బ్యాంక్ (QCB) కీలక ఆదేశాలు జారీ చేసింది. బీమా సంస్థలు, ఎక్స్ఛేంజ్ హౌస్‌లు, ఫైనాన్స్ కంపెనీలు ఈ మార్గదర్శకాలను అమలు చేయాలని సూచించింది.

ప్రధాన సూచనలు ఇవే..

* వికలాంగులు, వృద్ధుల అవసరాలపై ఆర్థిక సంస్థల ఉద్యోగులకు అవగాహన కల్పించాలి.

* ఈ వర్గాలకు చెందిన కస్టమర్లకు లావాదేవీల సమయంలో ప్రాధాన్యత ఇవ్వాలి.

* ఆర్థిక దోపిడీకి సంబంధించిన సంకేతాలను గుర్తించి, తగిన విధంగా స్పందించేలా ఉద్యోగులకు శిక్షణ ఇవ్వాలి.

* బ్రాంచ్‌లలోని కొంతమంది కస్టమర్ సర్వీస్ ఉద్యోగులకు సైన్ భాష (Sign Language) ప్రాథమిక అంశాలపై శిక్షణ ఇవ్వాలి.

ఈ చర్యలు ఖతార్ మూడో ఆర్థిక రంగ వ్యూహం, అలాగే ఆర్థిక రంగానికి సంబంధించిన ESG (Environmental, Social and Governance) మరియు సస్టైనబిలిటీ స్ట్రాటజీకి అనుగుణంగా చేపడుతున్నట్లు QCB తెలిపింది.

అందరికీ సమాన అవకాశాలు

2025లో ఆర్థిక రంగానికి ఇదే అంశంపై జారీ చేసిన మార్గదర్శకాలకు కొనసాగింపుగా తాజా సూచనలు తీసుకొచ్చినట్లు QCB పేర్కొంది. సమాజంలోని వివిధ వర్గాలకు తగిన, సులభంగా అందుబాటులో ఉండే ఆర్థిక సేవలను అందించడం ద్వారా ఆర్థిక సమగ్రత (Financial Inclusion), సమాన అవకాశాలను ప్రోత్సహించడమే లక్ష్యమని తెలిపింది.

ఆర్థిక సేవలకు అందుబాటును మరింత మెరుగుపరిచేలా నియంత్రణ వ్యవస్థలను అభివృద్ధి చేస్తూ, మరింత సుస్థిరమైన, సమగ్ర ఆర్థిక రంగం నిర్మాణానికి QCB కృషి కొనసాగిస్తుందని వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com