రియాద్‌కు ఉత్తరంగా హౌతీ బాలిస్టిక్ మిస్సైల్ కూల్చివేత..!!
- October 07, 2026
రియాద్: సౌదీ అరేబియా రాజధాని రియాద్‌కు ఉత్తరంగా ప్రయోగించిన హౌతీల బాలిస్టిక్ మిస్సైల్ ను కూటమి బలగాలు అడ్డుకుని ధ్వంసం చేసినట్లు యెమెన్‌లో చట్టబద్ధ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చే కూటమి వెల్లడించింది.
బుధవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగినట్లు కూటమి తెలిపింది. హౌతీలు ప్రయోగించిన మిస్సైల్ ను తమ రక్షణ వ్యవస్థలు గుర్తించి, రియాద్‌కు ఉత్తరంగా దానిని అడ్డుకున్నట్లు పేర్కొంది.
సనా మీదుగా ప్రయోగ వేదిక గుర్తింపు
మిస్సైల్ ప్రయోగించిన ప్లాట్‌ఫామ్‌ను తమ ఇంటెలిజెన్స్ వ్యవస్థలు సనా ప్రాంతంపై గుర్తించి ట్రాక్ చేస్తున్నట్లు కూటమి అధికార ప్రతినిధి మేజర్ జనరల్ టుర్కీ అల్-మాలికీ తెలిపారు. యోగ వేదికను గుర్తించి ధ్వంసం చేస్తామని ఆయన వెల్లడించారు. ఇంతకుముందు కూడా ఖమీస్ ముషైత్ వైపు హౌతీలు ప్రయోగించిన మరో బాలిస్టిక్ క్షిపణిని కూటమి అడ్డుకుని ధ్వంసం చేసినట్లు ప్రకటించింది.
మూడు ప్రాంతాల నుంచి ముప్పు
సనా, సాదా, అమ్రాన్ ప్రావిన్సులను హౌతీల మిస్సైల్ దాడులకు సంబంధించిన ప్రధాన వనరులుగా కూటమి పేర్కొంది. బాలిస్టిక్, భూమి నుంచి భూమికి ప్రయోగించే మిస్సైళ్ల ముప్పును నిరంతరం అడ్డుకుంటామని, వాటి ప్రయోగ కేంద్రాలను ధ్వంసం చేసే చర్యలను కొనసాగిస్తామని కూటమి స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- బైక్‌లు, క్యాంప్‌సైట్ అద్దె పేరుతో ఆన్లైన్ మోసాలు..
- దుబాయ్‌లో ఘనంగా తెలుగు చార్టర్డ్ అకౌంటెంట్ల వనభోజనాలు.. 350 మందికి పైగా హాజరు
- బహ్రెయిన్‌పై ఇరాన్ దాడిని ఖండించిన ఖతార్
- యెమెన్‌లో వారం రోజుల్లో 1,269 పేలుడు పదార్థాలను నిర్వీర్యం చేసిన సౌదీ మసామ్ ప్రాజెక్టు
- లిబియాలో రష్యా నౌకపై డ్రోన్ దాడి అనుమానం.. బెంఘాజీ నౌకాశ్రయంలో భారీ పేలుడు
- రష్యా పౌరుడిని ఎయిర్ లిఫ్ట్ చేసిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- సౌదీలో అక్రమ నివాసులపై భారీ చర్యలు..!!
- ఖతార్‌లో ఇక పేపర్ సిక్‌లీవ్ సర్టిఫికెట్లకు సెలవు..!
- కువైట్‌లో 10 మంది అరెస్ట్, 6 వాహనాలు స్వాధీనం..!!
- ఇరాన్ దాడులపై UN కు బహ్రెయిన్ ఫిర్యాదు..!!







