ఇక వాట్సాప్లోనే క్యాస్ట్ సర్టిఫికెట్
- October 08, 2026
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజా సేవలను మరింత వేగవంతం, పారదర్శకం చేసే దిశగా ‘మనమిత్ర’ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా మరో కీలక విప్లవాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఇకపై సచివాలయాలు లేదా మీసేవ కేంద్రాల చుట్టూ తిరిగే పనిలేకుండా నేరుగా మీ మొబైల్ వాట్సాప్ ద్వారానే క్యాస్ట్ (కుల) సర్టిఫికెట్‌ను సులభంగా డౌన్‌లోడ్ చేసుకునే వీలు కల్పించింది. దీని కోసం వినియోగదారులు 95523 00009 అనే అధికారిక వాట్సాప్ నంబర్‌కు ‘HI’ అని మెసేజ్ పంపాల్సి ఉంటుంది. ఆ తర్వాత స్క్రీన్‌పై కనిపంచే మెనూ ద్వారా ‘సేవలు’ (Services) ఆప్షన్‌లోకి వెళ్లి, అందులోని ‘రెవెన్యూ సేవలు’ విభాగాన్ని ఎంచుకోవాలి. అక్కడ ‘రీ ఇష్యూయెన్స్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ సర్టిఫికెట్’ (Re-issuance of Integrated Certificate) ను సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఆధార్ OTP, Rs.40 రుసుముతో నిమిషాల్లో డౌన్‌లోడ్!
ఆప్షన్ ఎంచుకున్న అనంతరం మీ ఆధార్ సంఖ్యను నమోదు చేయాల్సి ఉంటుంది. ఆధార్‌తో అనుసంధానమైన మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీ (OTP) తో పాటు అవసరమైన ప్రాథమిక వివరాలను అక్కడ సమర్పించాలి. ఆ తర్వాత ప్రభుత్వం నిర్దేశించిన ₹40 సర్వీస్ ఛార్జీని వాట్సాప్ యూపీఐ లేదా ఇతర డిజిటల్ పేమెంట్ విధానాల ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. లావాదేవీ విజయవంతం కాగానే మీ డిజిటల్ క్యాస్ట్ సర్టిఫికెట్ తక్షణమే వాట్సాప్‌లోనే పీడీఎఫ్ (PDF) రూపంలో డౌన్‌లోడ్ అవుతుంది. ఈ విధానం వల్ల సామాన్య ప్రజలకు సమయం, డబ్బు ఆదా అవ్వడమే కాకుండా డిజిటల్ పాలనలో ఏపీ సరికొత్త మైలురాయిని చేరుకుందని నిపుణులు కొనియాడుతున్నారు.
తాజా వార్తలు
- విజయవాడలో దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ సదస్సు
- అబుదాబిలో కార్మికుల నివాస పరిస్థితులపై మానవ హక్కుల సంస్థ క్షేత్రస్థాయి పరిశీలన
- సౌదీ విమానాశ్రయాలపై హౌతీ దాడులు.. ముగ్గురు మృతి, 36 మందికి గాయాలు
- ఇక వాట్సాప్లోనే క్యాస్ట్ సర్టిఫికెట్
- దుబాయ్‌లో ప్రాంతాల వారీగా రంగులతో కొత్త స్ట్రీట్ సూచికలు
- విద్యార్థులే వికసిత్ భారత్ నిర్మాణ శిల్పులు: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- రేపు సీఐఐ భాగస్వామ్య సదస్సులో పాల్గొననున్న సీఎం చంద్రబాబు
- రియాద్‌కు ఉత్తరంగా హౌతీ బాలిస్టిక్ మిస్సైల్ కూల్చివేత..!!
- వికలాంగులు, వృద్ధులకు ఆర్థిక సేవలు.. ఖతార్ సెంట్రల్ బ్యాంక్ కీలక ఆదేశాలు..!!
- దుబాయ్‌లో షేర్డ్ హౌసింగ్‌పై కొత్త నిబంధనలు..!!







