సౌదీ విమానాశ్రయాలపై హౌతీ దాడులు.. ముగ్గురు మృతి, 36 మందికి గాయాలు

- October 08, 2026 , by Maagulf
సౌదీ విమానాశ్రయాలపై హౌతీ దాడులు.. ముగ్గురు మృతి, 36 మందికి గాయాలు

రియాద్: సౌదీ అరేబియాలోని విమానాశ్రయాలపై మంగళవారం, బుధవారం జరిగిన దాడుల్లో ముగ్గురు మృతి చెందగా, మరో 36 మంది గాయపడినట్లు సౌదీ సివిల్ ఏవియేషన్ అథారిటీ వెల్లడించింది.

అధికారుల వివరాల ప్రకారం.. అభా అంతర్జాతీయ విమానాశ్రయంపై జరిగిన దాడుల్లో ఇద్దరు మృతి చెందారు. మృతుల్లో మొరాకో, అల్జీరియా దేశాలకు చెందిన మహిళా నివాసితులు ఉన్నారు. ఈ దాడిలో మరో 28 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో సౌదీ పౌరులతో పాటు బంగ్లాదేశ్, ఫిలిప్పీన్స్‌కు చెందిన ఇద్దరు నివాసితులు కూడా ఉన్నారు. వీరిలో కొందరి పరిస్థితి స్వల్పంగా ఉండగా, మరికొందరికి తీవ్ర గాయాలైనట్లు అధికారులు తెలిపారు.

ఇదే సమయంలో కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై జరిగిన దాడిలో ఒకరు మృతి చెందారు. మృతుడు సూడాన్‌కు చెందిన నివాసితుడిగా గుర్తించారు. ఈ ఘటనలో మరో ఎనిమిది మంది గాయపడ్డారు. వీరిలో ఐదుగురు సౌదీ పౌరులు, ఇద్దరు ఈజిప్టు నివాసితులు, ఒకరు పాకిస్థాన్‌కు చెందిన వ్యక్తి ఉన్నారు.

ఈ దాడుల కారణంగా విమానాశ్రయాల్లో కొంత ఆస్తి నష్టం కూడా సంభవించినట్లు సౌదీ సివిల్ ఏవియేషన్ అథారిటీ తెలి

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com