సౌదీ అరేబియాలో ఏడు ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లపై చర్యలు..!!

- October 08, 2026 , by Maagulf
సౌదీ అరేబియాలో ఏడు ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లపై చర్యలు..!!

రియాద్: పర్యాటక చట్టాన్ని ఉల్లంఘించిన ఏడు ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లను సౌదీ అరేబియా పర్యాటక మంత్రిత్వ శాఖ సంబంధిత అధికారులతో కలిసి బ్లాక్ చేసింది. నిబంధనలకు అనుగుణంగా అనుమతులు, అవసరమైన నియంత్రణ ప్రమాణాలు లేకుండానే ఈ ప్లాట్‌ఫామ్‌లు పలు ప్రయాణ, పర్యాటక సేవలను అందిస్తున్నట్లు గుర్తించారు. దేశీయ ఉమ్రా ప్యాకేజీలు, పర్యాటక విహారయాత్రలు వంటి సేవలను నిబంధనలను పాటించకుండా అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అక్రమ పర్యాటక కార్యకలాపాలను అరికట్టడం, పర్యాటకులు, ఉమ్రా యాత్రికుల హక్కులను రక్షించడం ఈ చర్యల ప్రధాన ఉద్దేశమని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

అలాగే మోసపూరిత సేవలు, నాణ్యతా ప్రమాణాలు పాటించని పర్యాటక సేవల నుంచి ప్రజలను రక్షించేందుకు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపింది.పర్యాటక మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి నస్ర్ అల్-అన్సారీ మాట్లాడుతూ.. ఆన్‌లైన్ ట్రావెల్ ప్లాట్‌ఫామ్‌లతో పాటు వివిధ పర్యాటక రంగాల్లో నిబంధనల ఉల్లంఘనలను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పర్యాటకులు, ఉమ్రా యాత్రికులు తమ హక్కులను కాపాడుకోవడంతో పాటు నాణ్యమైన సేవలు పొందేందుకు లైసెన్స్ పొందిన ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లు, గుర్తింపు పొందిన ట్రావెల్ మరియు టూరిజం కార్యాలయాలనే ఆశ్రయించాలని మంత్రిత్వ శాఖ సూచించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com