దుబాయ్ ట్యాక్సీ డ్రైవర్ నిజాయితీ.. యూఏఈకి మకాం మార్చిన భారతీయ వ్యాపారి..!!
- October 08, 2026
దుబాయ్: ఓ ట్యాక్సీలో మర్చిపోయిన హ్యాండ్‌బ్యాగ్.. దానిని నిజాయితీగా తిరిగి అప్పగించిన డ్రైవర్ వ్యవహారం ఓ భారతీయ వ్యాపారి కుటుంబం జీవితాన్నే మార్చేసింది. దుబాయ్‌లో ఎదురైన ఈ అనుభవంతో దక్షిణాఫ్రికాలోని తన ఆస్తులను విక్రయించి, యూఏఈకి తరలివచ్చినట్లు రిటైర్డ్ బ్రిగేడియర్ జనరల్, న్యాయ సలహాదారు ఆరిఫ్ బుషాఖర్ అల్ ఫలాసీ వెల్లడించారు. అరబ్కాస్ట్ పోడ్కాస్ట్లో ఆయన ఈ ఘటనను వివరించారు. దక్షిణాఫ్రికా నుంచి దుబాయ్‌కి సందర్శనకు వచ్చిన భారతీయ వ్యాపారి భార్య తన కుమార్తెతో కలిసి ఓ మాల్‌కు వెళ్లేందుకు ట్యాక్సీ ఎక్కారు. మాల్ వద్ద దిగిన తర్వాత తన హ్యాండ్‌బ్యాగ్‌ను ట్యాక్సీలోనే మర్చిపోయారు.
కొద్దిసేపటి తర్వాత బ్యాగ్ కనిపించడం లేదని గుర్తించిన వారు, ట్యాక్సీ తీసుకున్న హోటల్‌కు తిరిగి వెళ్లారు. అక్కడే అదే ట్యాక్సీ డ్రైవర్ కనిపించాడు. బ్యాగ్‌ను కారులో వదిలివెళ్లారని డ్రైవర్ వారికి చెప్పాడు.హోటళ్ల వద్ద ప్రయాణికులను ఎక్కించే ట్యాక్సీలు ప్రయాణికులను దించిన తర్వాత తిరిగి తమ ప్రారంభ ప్రాంతానికి చేరుకోవాలనే రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (RTA) విధానం కారణంగా డ్రైవర్ అక్కడికి తిరిగి వచ్చినట్లు అల్ ఫలాసీ తెలిపారు.బ్యాగ్‌ను తెరిచి చూసిన ఆమెకు అందులోని వస్తువులన్నీ యథాతథంగా కనిపించాయి. దీంతో ఆమెకు దుబాయ్‌లోని భద్రత, ప్రజల నిజాయితీపై విశ్వాసం ఏర్పడింది.
తన స్వదేశంలో ఇంటికి భద్రతా వ్యవస్థలు, తాళాలు ఉన్నప్పటికీ దొంగతనం ఎదురైందని ఆమె తన భర్తతో చెప్పినట్లు అల్ ఫలాసీ తెలిపారు. అయితే దుబాయ్‌లో బ్యాగ్ పోయినా అందులోని వస్తువులన్నింటితో తిరిగి లభించిందని ఆమె పేర్కొన్నట్లు చెప్పారు.ఈ అనుభవంతో దుబాయ్‌లోనే ఉండాలని ఆమె భర్తను కోరారు. తొలుత ఇంత పెద్ద నిర్ణయం వెంటనే తీసుకోవడం సాధ్యం కాదని ఆయన చెప్పినప్పటికీ, ఆరు నెలల్లో మొత్తం ఆస్తులను సర్దుకుని దుబాయ్‌కు మారుతానని హామీ ఇచ్చారు.అనంతరం వ్యాపారి దక్షిణాఫ్రికాలోని తన ఆస్తులను విక్రయించి, తనకు చెందిన సంస్థలోని అత్యుత్తమ 10 మంది ఉద్యోగులను మేనేజర్లుగా ఎంపిక చేసుకుని వారితో కలిసి దుబాయ్‌కు తరలివచ్చినట్లు అల్ ఫలాసీ తెలిపారు.
ఒక సాధారణ ట్యాక్సీ డ్రైవర్ నిజాయితీ చూపిన తీరు ఒక కుటుంబం దుబాయ్‌పై అభిప్రాయాన్ని మార్చడమే కాకుండా, చివరకు వారి నివాసం, వ్యాపార కేంద్రాన్ని మార్చుకునేలా చేసిందని ఆయన పేర్కొన్నారు. ప్రజల రోజువారీ ప్రవర్తన కూడా ఒక దేశానికి భద్రత, విశ్వసనీయతపై మంచి అభిప్రాయాన్ని కల్పించే ‘సాఫ్ట్ పవర్’గా పనిచేస్తుందని అల్ ఫలాసీ వివరించారు.
తాజా వార్తలు
- ఖతార్‌లో ఇంపౌండ్ వాహనాల ఆన్లైన్ వేలం..!!
- గల్ఫ్ దేశాల భద్రతపై జీసీసీ పోలీస్ చీఫ్‌ల కీలక సమావేశం..!!
- దుబాయ్ ట్యాక్సీ డ్రైవర్ నిజాయితీ.. యూఏఈకి మకాం మార్చిన భారతీయ వ్యాపారి..!!
- సౌదీ అరేబియాలో ఏడు ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లపై చర్యలు..!!
- లోక్ భవన్లో 77వ టీబీ సీల్ విక్రయ కార్యక్రమాన్ని ప్రారంభించిన గవర్నర్ అబ్దుల్ నజీర్
- గ్రామీణ కళాకారుల శ్రమకు తగిన ప్రతిఫలం దక్కాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- భారత్–ఒమన్ ఆర్థిక భాగస్వామ్యంపై కీలక చర్చలు..!!
- ప్రపంచ పర్యాటకులను భాగస్వాములుగా ఆహ్వానిస్తున్నాం: మంత్రి కందుల దుర్గేష్
- తెలంగాణ ఓటర్ల జాబితాలో భారీ మార్పులు..71.23 లక్షల మందికి చోటు
- హౌసింగ్ నిబంధనల ఉల్లంఘన.. 4 భవనాలకు విద్యుత్ కట్..!!







