కమోడిటీ ధరలు పెంపు: 350 కంపెనీలకు జరీమానా
- August 24, 2016
కమోడిటీ ధరల్ని పెంచినందుకుగాను 350 కంపెనీలకు జరీమానా విధించింది కువైట్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. ప్రభుత్వం ఇంధన ధరల సబ్సిడీలను రేషనలైజ్ చేయడంతో పలు కంపెనీలు, కమర్షియల్ స్టోర్స్ ఇబ్బడిముబ్బడిగా ధరల్ని పెంచేశాయి. అయితే కమర్షియల్ సూపర్విజన్ మరియు కన్స్యూమర్ ప్రొటెక్షన్ డిపార్ట్మెంట్, నిబంధనలు ఉల్లంఘించి ధరల్ని పెంచిన కంపెనీలు, స్టోర్లపై దాడులు చేసి, వాటికి జరీమానాలు విధించింది. వీటిల్లో గడువు తీరిన ఆహార పదారాల్ని విక్రయిస్తున్నందుకు విధించే జరీమానాలు కూడా ఉన్నాయి. క్యాబినెట్ గైడెన్స్లో కమర్షియల్ సూపర్ విజన్ డిపార్ట్మెంట్ నుంచి ఇన్స్పెక్టర్స్ ఈ తనిఖీల్ని నిర్వహించారు. ఇంధన ధరల్ని రేషనలైజ్ చేయడం వల్ల ఆహారం మరియు కన్స్యూమర్ వస్తువుల ధరలపై ఎలాంటి ప్రభావం ఉండబోదని ఈ సందర్భంగా కమర్షియల్ సూపర్విజన్ అండ్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ అండర్ సెక్రెటరీ ఈద్ అల్ రషిది చెప్పారు.
తాజా వార్తలు
- సముద్రంలో మునిగిన నౌక.. నీటి పై తేలుతున్న ఖరీదైన ఐఫోన్లు!
- అక్టోబర్ 24న హైదరాబాద్లో కాంగ్రెస్ నిరసన!
- విజయవాడలో ముగిసిన రాష్ట్రపతి పర్యటన
- BD30కే అద్దె కారు.. ప్రమాదంతో BD6,204 జరిమానా..!
- నిత్యావసర వస్తువులు, ఇంధన సరఫరాకు కువైట్ కీలక చర్యలు..!!
- అబుదాబిలో ఘోర రోడ్డు ప్రమాదం.. తల్లి, 15 ఏళ్ల కుమారుడు మృతి..!!
- దుబాయ్లో GTF ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.
- ఖతార్లో అన్ని రంగాల్లో మహిళా సాధికారతకు ప్రోత్సాహం..!!
- ఒమన్లో రాళ్లను ఢీకొని నిలిచిపోయిన పడవ..!!
- సౌదీలో ‘సిక్స్ కింగ్స్ స్లామ్’ వాయిదా.. కొత్త తేదీలు ఇవే..!







