సెప్టెంబర్ 25 లోగా వచ్చెయ్యండి: సుష్మా స్వరాజ్ సూచన
- August 24, 2016
సెప్టెంబర్ 25 లోగా వచ్చెయ్యండి: సుష్మా స్వరాజ్ సూచన ఉద్యోగాలు కోల్పోయి రోడ్డునపడ్డ భారతీయులెవరైనాసరే సౌదీ నుంచి స్వదేశానికి సెప్టెంబర్ 25 లోపు రావాలనీ, వారికి తగిన ఏర్పాట్లను కేంద్ర ప్రభుత్వం చేస్తుందని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ సోషల్ మీడియా ద్వారా విజ్ఞప్తి చేశారు. సెప్టెంబర్ 25 తర్వాత వచ్చేవారు మాత్రం, తమ తమ ఏర్పాట్లు చేసుకోవాలి తప్ప ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు అందవని ఆమె స్పష్టం చేశారు. ఇంకో వైపున ఫిలిప్పీన్స్ కూడా తమ పౌరులు స్వదేశానికి వచ్చేందుకు తగిన ఏర్పాట్లు చేస్తోంది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరల పతనం, ఇతరత్రా కారణాలతో సౌదీలో ఉద్యోగాలు చేస్తున్నవారికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కంపెనీలు మూతపడ్డంతో ఉద్యోగాలు లేక, కనీసం తినడానికి తిండి లేక వివిధ దేశాలకు చెందిన వలసదారులు నానా కష్టాలూ పడుతున్నారు. భారత ప్రభుత్వం ఇప్పటికే సౌదీలో ఇబ్బందులు పడుతున్నవారిని ఆదుకునేందుకు తగిన చర్యలు చేపట్టింది.
తాజా వార్తలు
- సముద్రంలో మునిగిన నౌక.. నీటి పై తేలుతున్న ఖరీదైన ఐఫోన్లు!
- అక్టోబర్ 24న హైదరాబాద్లో కాంగ్రెస్ నిరసన!
- విజయవాడలో ముగిసిన రాష్ట్రపతి పర్యటన
- BD30కే అద్దె కారు.. ప్రమాదంతో BD6,204 జరిమానా..!
- నిత్యావసర వస్తువులు, ఇంధన సరఫరాకు కువైట్ కీలక చర్యలు..!!
- అబుదాబిలో ఘోర రోడ్డు ప్రమాదం.. తల్లి, 15 ఏళ్ల కుమారుడు మృతి..!!
- దుబాయ్లో GTF ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.
- ఖతార్లో అన్ని రంగాల్లో మహిళా సాధికారతకు ప్రోత్సాహం..!!
- ఒమన్లో రాళ్లను ఢీకొని నిలిచిపోయిన పడవ..!!
- సౌదీలో ‘సిక్స్ కింగ్స్ స్లామ్’ వాయిదా.. కొత్త తేదీలు ఇవే..!







