ఒమన్, అర్మేనియా చర్చలు..పలు కీలక అంశాలపై సమీక్ష..!!
- October 13, 2026
మస్కట్: ఒమన్ విదేశాంగ మంత్రి సయ్యద్ బదర్ బిన్ హమద్ అల్ బుసైదీ, అర్మేనియా విదేశాంగ మంత్రి అరరత్ మిర్జోయన్తో ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఒమన్, అర్మేనియా దేశాల మధ్య ఉన్న స్నేహ సంబంధాలు, పరస్పర సహకారంపై ఇరువురు నేతలు చర్చించారు. రెండు దేశాల ఉమ్మడి ప్రయోజనాలకు అనుగుణంగా వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడం, సహకారాన్ని విస్తరించే మార్గాలపై అభిప్రాయాలను పంచుకున్నారు.
అలాగే, పరస్పర ఆసక్తి ఉన్న పలు ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చించారు. ప్రాంతీయంగా, అంతర్జాతీయంగా భద్రత, శాంతిని ప్రోత్సహించేందుకు చేపడుతున్న ప్రయత్నాలపైనా ఇరువురు విదేశాంగ మంత్రులు తమ అభిప్రాయాలను వెల్లడించారు.
తాజా వార్తలు
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
- దుబాయ్లో ఘనంగా ‘ఇసుక తిన్నెల పై బతుకమ్మ’ పాట ఆవిష్కరణ
- ఖతార్లో అక్టోబర్ 16న ‘ఫెస్టివల్ ఆఫ్ వెకేషన్ అండ్ ఫన్’..!!
- యూఏఈలో ఫేస్ మాస్కుల రీకాల్.. నాణ్యత లోపాలపై హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో బీభత్సం..!!
- టీమ్ ఇండియాలో కొత్త ఆల్రౌండర్.. !
- కువైట్లో ర్యాష్ డ్రైవింగ్.. ప్రభుత్వ ఆస్తులకు నష్టం..!!
- ఒమన్, అర్మేనియా చర్చలు..పలు కీలక అంశాలపై సమీక్ష..!!
- బహ్రెయిన్ పౌరులకు విద్యుత్, నీటి బిల్లుల్లో ఊరట..!!







