ఖతార్‌లో అక్టోబర్ 16న ‘ఫెస్టివల్ ఆఫ్ వెకేషన్ అండ్ ఫన్’..!!
- October 13, 2026
దోహాః ఖతార్‌లోని 974 బీచ్‌లో అక్టోబర్ 16న ‘ఫెస్టివల్ ఆఫ్ వెకేషన్ అండ్ ఫన్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి కుటుంబాలు, నివాసితులు హాజరుకావాలని మున్సిపాలిటీ మంత్రిత్వ శాఖ ఆహ్వానించింది. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఈ వేడుకలు కొనసాగనున్నాయి. పిల్లలకు సురక్షితమైన, కుటుంబసభ్యులతో కలిసి ఆనందించే వాతావరణంలో వివిధ వినోద, సృజనాత్మక కార్యక్రమాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ వేడుకల్లో భాగంగా ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్, గాలితో నింపిన ఆట పరికరాలు (ఇన్‌ఫ్లేటబుల్స్), బబుల్ షో, ఫేస్ పెయింటింగ్ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు.
టికెట్ ధరలు ఇలా ఉన్నాయి:
- ఆరేళ్లలోపు పిల్లలకు ఉచిత ప్రవేశం.
- దివ్యాంగులకు ఉచిత ప్రవేశం.
- 14 ఏళ్లలోపు పిల్లలకు QR15.
- పెద్దలకు QR35.
- వాహనంతో బీచ్‌లోకి ప్రవేశించేందుకు QR150.
ఫ్యామిలీలు, పిల్లలు కలిసి సరదాగా గడిపేందుకు ఈ కార్యక్రమం అవకాశం కల్పించనుందని నిర్వాహకులు తెలిపారు.
తాజా వార్తలు
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
- దుబాయ్‌లో ఘనంగా ‘ఇసుక తిన్నెల పై బతుకమ్మ’ పాట ఆవిష్కరణ
- ఖతార్‌లో అక్టోబర్ 16న ‘ఫెస్టివల్ ఆఫ్ వెకేషన్ అండ్ ఫన్’..!!
- యూఏఈలో ఫేస్ మాస్కుల రీకాల్.. నాణ్యత లోపాలపై హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో బీభత్సం..!!
- టీమ్ ఇండియాలో కొత్త ఆల్‌రౌండర్.. !
- కువైట్‌లో ర్యాష్ డ్రైవింగ్.. ప్రభుత్వ ఆస్తులకు నష్టం..!!
- ఒమన్, అర్మేనియా చర్చలు..పలు కీలక అంశాలపై సమీక్ష..!!
- బహ్రెయిన్ పౌరులకు విద్యుత్, నీటి బిల్లుల్లో ఊరట..!!







